నెక్లెస్ రోడ్డులో స్ఫూర్తి స్థల్లో కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి 80వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి లేకపోయినా ఆయన సాధించిన తెలంగాణలో మనము ఉన్నామన్నారు. రాజకీయ విలువలు కాపాడడంలో జైపాల్ రెడ్డి ఒకరని, దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జైపాల్ రెడ్డి తీసుకున్నారని గుర్తు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌లో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.. ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష ఎస్పీ.. ఇంకో వైపు కాంగ్రెస్, మరోవైపు బీఎస్పీ ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. అందేంటి? బీజేపీకి వరుసగా షాక్‌లు ఇస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తూ.. ఎస్పీ గూటికి క్యూ కడుతోన్న సమయంలో.. అఖిలేష్ యాదవ్.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు…
అకాల వర్షాల వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం రైతులు తీవ్రంగా నష్టపోయారని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నకీల విత్తనాల కారణంగా మిర్చి రైతులకు వచ్చే క్వింటాల్ మిర్చి కూడా అకాల వర్షాలతో రాకుండా పోయిందని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ వర్షాలకు ధాన్యం తడిచిపోయిందని ఆయన వెల్లడించారు. దాదాపు 500 కోట్ల పంట నష్టం జరిగిందని, పంట నష్టం జరిగితే ఏడేళ్లలో ఇంత…
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్తికరమైన పరిణామం చోటు చేసుకుంది… 2017 ఉన్నావ్ అత్యాచార ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే కాగా… ఇప్పుడు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని ఎన్నికల బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ.. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లిని కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంది. 19 ఏళ్ల బాధితురాలి తల్లి పేరును పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈరోజు విడుదల చేశారు. బాలికపై అత్యాచారం కేసులో…
ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగిన ఘటన నిర్భయ కేసు కన్నా దారుణమని.. రాఘవేంద్ర అసైన్డ్, ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడని మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ భవన్లో మాట్లాడుతూ ..టీఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ మీ చుట్టాల్లో ఎవరైనా చనిపోతే పోతావు. ఎంతోమంది రైతులు చనిపోతున్నారు.. పాల్వంచ కైనా పోవాలి కదా.. ముఖ్యమంత్రి, మంత్రులు ఇంత వరకూ ఈ ఘటనపై ఎందుకు మాట్లడలేదంటూ…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు…
చైనాలో తయారైన రామనుజాచార్యుల విగ్రహావిష్కరణకు రావద్దని, అలా వస్తే మీరు దేశద్రోహులే అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మోడీ ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్, మోడీ దేశభక్తి నేతి బీరకాయలో నేతి అంత అని ఆయన ఎద్దేవా చేశారు. Read Also: పాల్వంచ ఘటన..రామకృష్ణ తల్లి, సోదరి అరెస్టు బీజేపీ నేతలు మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెబుతారని,…
బీజేపీ పై మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పై ధ్వజమెత్తారు. బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. నల్లదనం తెచ్చి పేదల అకౌంట్లలో 15 లక్షలు వేస్తా అన్నారు. ఏమైంది…? తెలంగాణకి వస్తున్న బీజేపీ ముఖ్యమంత్రలు 15 లక్షల ప్రస్తావన ఎందుకు తేవడం లేదు..? బీజేపీ చరిత్ర మార్చే కుట్ర చేస్తుంది తప్పితే చేసింది ఏం లేదని విమర్శించారు. బీజేపీ నాయకులు మాట మీద…
తెలంగాణ రాజకీయంలో రోజుకో వీధి బాగోతం నడుస్తోందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాల్లో నటులను ఇక్కడికి తెచ్చి రంజింప చేసే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ కి రాజకీయ ప్రయోజనాల కంటే..రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అన్నారు. కెసిఆర్ రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థ కి కేంద్రం ఆమోదం తో రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చింది. జీఓ 317తో ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీఓ ఉందన్నారు రేవంత్.…
ఉద్యోగ బదీలీలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారటీఆర్ఎస్, బీజేపీ పై మండిపడ్డారు. జీఓ 317తో స్థానికత అనేదానికి న్యాయం లేకుండా పోయిందన్నారు. స్థానికత కోసం తెచ్చుకున్న తెలంగాణలో నేడు గందరగోళం సృష్టించారన్నారు. స్థానికత పై రాష్ట్రం పంపిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఎందుకు సమీక్ష కోరలేదని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రపతికి పంపి ఆమోదం వేయించింది మీరు అంటూ బీజేపీ పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు బండి…