మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. నిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన.. తెలంగాణలో అవినీతి దేశంలో ఎక్కడ లేదని జేపీ నడ్డా చెబుతున్నారు.. మరీ, ఆ అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. Read Also: కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విమాన చార్జీలు..! ఢిల్లీ నుంచి తెలంగాణకు…
గత రెండు రోజులుగా తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, జీవో 317లో సవరణల కోసం బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మరుసటి రోజు కోర్టులో హజరుపరిచారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు సికింద్రబాద్‌లో…
జీవో 317 తో దళిత ఉద్యోగులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగరి గారి ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముల్కీ.. నాన్ ముల్కీ ఉద్యమం మాదిరిగా మరో ఉద్యమం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. దళిత ఎమ్మెల్యేలు బయటకు రండి.. కేసీఆర్‌కు ఊడిగం చేయడం మానండి అంటూ ధ్వజమెత్తారు. Read Also:శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అవంతి శ్రీనివాస్ దళిత బంధు వెంటనే అమలు చేయండి సంక్రాంతి తర్వాత నియోజకవర్గాల్లో…
గత రెండు రోజులుగా బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం పట్ల రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య రాజకీయ డ్రామా నడుస్తోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ల లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే రాష్ట్రంలో రచ్చ చేస్తున్నాయన్నారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకున్నా.. సంజయ్ నీ అరెస్ట్ చేశారని, నడ్డాను కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు…
కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి.. ఈ పేరు చెబితే అంతగా గుర్తు పట్టకపోవచ్చు కానీ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే మాత్రం తెలంగాణవాసులందరికీ సుపరిచితమే. ఈ రాజకీయ ప్రస్థానం కౌన్సిలర్‌గా ప్రారంభమైంది. ఆ నాటి నుంచి నేటి వరకు వివిధ పార్టీలు మారినా తన దైన శైలితో రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషిస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచి, ఓ సారి చీఫ్ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంత రాజకీయ అనుభవం…
తెలంగాణ కాంగ్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య పొంతన కుదరడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జగ్గారెడ్డి పార్టీలో విముఖతతోనే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి తీరుతో టీఆర్ఎస్ కోవర్టు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన నేను కేసీఆర్ కోవర్టును కాదని, నేనేవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. అయితే తాజాగా మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో కొత్తగా…
నూతన జోన్, జిల్లాలవారీగా ఉద్యోగుల కేటాయింపులు జరిగినప్పుడు స్థానికత ఆధారంగా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల కొత్త జిల్లాగా ఏర్పడిందన్నారు. జగిత్యాలలో ఉద్యోగం చేస్తున్న అతను ఇంకో జిల్లాకు కేటాయించారు. ఉద్యోగుల స్థానికతలో ఇబ్బందులు వస్తే పిల్లల స్థానికత కూడా మారుతుందన్నారు. Read Also: ఫాంహౌస్‌లో కూర్చోని రాత్రికి రాత్రే జీవోలు తెస్తారా..?…
రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోపై ఆయన స్పందించారు. 317జీవో తెచ్చి ఉద్యోగులను గందరగోళానికి గురిచేశారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు. కనీసం ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించకుండా జీవో ఎలా తెస్తారని ప్రశ్నించారు. ఖాళీలను నింపి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని సూచించారు. Read Also: ఎల్బీనగర్ లోటస్ ఆస్పత్రిలో దారుణం ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని…
టీఆఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆయన మండిపడ్డారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గుండాల దాడిలో కాంగ్రెస్ నేత హత్యచేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దు అన్నందుకు టీర్ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారన్నారు. హతుడి సోదరుడితో ఫోన్లో మాట్లాడి పరామర్శించిన రేవంత్ రెడ్డి. 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Read…
కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సభ్యత్వ నమోదుపై చర్చించారు. అంతేకాకుండా 2023లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హుజుర్ నగర్, కోదాడ ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం మాఫియాలో మునిగితేలుతున్నారని, వచ్చే ఎన్నికల్లో హుజుర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీతో గెలుస్తామన్నారు. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఏడాది తరువాత టీఆర్ఎస్ పీడ వదులుతుందన్నారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది…