తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బహిరంగ సభను శ్రేణులు విజయవంతం చేయాలన్నారు. చెన్నూరుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేసి మంథని ప్రాంతాన్ని చిన్న చూపు చూడడం దురదృష్టకరమన్నారు. మంథని ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని, నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న…
కేటీఆర్ ఫ్రస్టేషన్తో ప్రజా సమస్యలపై చర్చ రాకుండా తిట్ల మీదే చర్చ వచ్చేలా మాట్లాడారని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల పైచిలుకు ఇస్తే.. ఒక కోటి ఆరవై లక్షలు మాత్రమే తెలంగాణకు ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం ఏంటని, అవి టీఆర్ఎస్, బీజేపీ పైసలు కాదు..ప్రజలు కట్టిన టాక్స్ లు.. అని ఆయన మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సింది…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాలని టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందన్న ఆయన.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మళ్లీ అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ కుట్ర రాజకీయం చేస్తుందని.. కాంగ్రెస్ అధికారంలోకి రావొద్దు అని టీఆర్ఎస్-బీజేపీ ప్లాన్ వేస్తున్నాయని మండిపడ్డారు.. ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు.. సీఎం కేసీఆర్ పరిపాలనలో విఫలం అయ్యారని విమర్శించారు జగ్గారెడ్డి.. అడిగారని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు..…
మా పార్టీ నాయకులపై కేసులు పెట్టిన పోలీసులపై దండయాత్ర చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… హైదరాబాద్ మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు (21వ తేదీన) ఖమ్మం వెళ్తున్నామని వెల్లడించారు.. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతలపై పీడీ యాక్టులు పెట్టిన కేసుల సంగతి తేలుస్తామన్న ఆయన.. ఇప్పటికే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు.. అందరం కలిసి వెళ్తున్నాం.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నేను.. ఇలా అందరం కలిసే వెళ్తాతం..…
ఈ దఫా తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ ఆశ. దూరమైన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. రాష్ట్రంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను మరింత బలంగా ఢీకొట్టేందుకు ఈ రెండు పార్టీలు వేయని ఎత్తుగడలు లేవు. ఈ క్రమంలో బీజేపీ రణతంత్రం ఒకలా ఉంటే.. కాంగ్రెస్ పొలిటికల్ వార్ ఇంకోలా ఉంది. కాకపోతే రెండు పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత ఉండటంతో.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో టెన్షన్ పట్టుకుందట. వాటిపైనే…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన రాహుల్ గాంధీ.. త్వరలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోపర్యటించనున్నారు.. ఆయన పర్యటనలో వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ఇక, రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి.పీసీసీ.. ఏర్పాట్లపై దృష్టిసారించిది.. అందులో భాగంగా.. ఈ నెల 22న వరంగల్లో పర్యటించనున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మరియు ముఖ్య…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కత్తి పట్టుకుని కూర్చున్నారు. 32 జిల్లాల్లో పార్టీ నాయకత్వం పై భారీగానే మార్పులు చేర్పులు చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సందర్భంగా కొందరికి కోత పెట్టడానికి కూడా సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చేదంతా ఎన్నికల సీజన్ కావడంతో.. మాజీ మంత్రులు.. మాజీ ఎమ్మెల్యేస్థాయి నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారికే డీసీసీ పదవులు కట్టబెటడతారని తెలుస్తోంది. ..spot.. జిల్లాలో బలమైన నాయకుడు అనే ముద్ర ఉండటంతోపాటు..…
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఠాగూర్, రేవంత్ల…
కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ఆరోపణలను సవాల్ గా తీసుకుని ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు…