తెలంగాణ గిరిజనులకు జనాభా ప్రాతిపదికన పెంచాల్సి ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అందుకు తగిన విధంగా 12 శాతం రిజర్వేషన్లు పెంచుతూ ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం తేల్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే తెలంగాణలో 7 సంవత్సరాలుగా విద్య, ఉద్యోగాల్లో గిరిజనులు అణిచివేతకి గురవుతున్నారు ఆయన ఆరోపించారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు తెచ్చి పోడు భూములకు హక్కులు కల్పించిందన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని, రిజర్వేషన్లు అమలు కాకపోవడం వల్ల గిరిజనులు నష్టపోతున్నారు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు జీవితాలతో చాలగటం అడకుండా గిరిజన రిజర్వేషన్ చట్టాన్ని కనీసం 10 శాతం అయిన తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.