తెలంగాణలోనూ ఏ నేత నోట విన్నా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వస్తుంది.. ఆయన చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్న, మొన్నా కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్ కాగా.. మరోవైపు ఢిల్లీలోనూ పీకే వ్యవహారానికి సంబంధించిన పరిణామాలు జోరుగా సాగాయి. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజేంటేషన్‌పై 8 మంది సభ్యులు… సోనియా గాంధీకి నివేదిక ఇచ్చారు. నివేదికపై కూలంకుషంగా చర్చించినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది.. ఈ సమావేశంపై అనేక విధాలుగా ప్రచారం సాగుతోంది.. అయితే, పీకే-కేసీఆర్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. గత మూడు రోజులుగా ఓ అలజడి నడుస్తోంది.. పీకే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ను కలపడానికి వచ్చిండు అంటున్నారు.. జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయానికి మేం ఏమి చెప్పలేమన్నారు.. కానీ, రాహుల్ గాంధీ… టీఆర్ఎస్ గుంపుతో చేరినోడు వద్దు, కేసీఆర్‌తో…
తెలంగాణలో మరోసారి పొత్తుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దానికి ప్రధాన కారణం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనే చెప్పాలి… ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యూహాలు రచిస్తున్న పీకే.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం గట్టిగానే సాగుతోంది.. కొందరు సీనియర్ నేతల మాటలు చూస్తుంటే.. పీకే కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. ఇదే సమయంలో.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని..! ఏకంగా కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనం కాబోతోందంటూ…
దేశంలో కాంగ్రెస్ పని అయిపోయింది..! ఏ ఎన్నికలు జరిగినా ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతున్నారు.. సీనియర్లు తిరుగుబాటు చేస్తున్నారు.. గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా నిలదీయలేని పరిస్థితి..! అంటే రకరకాల విమర్శలు ఎదుర్కొంటుంది ఆ పార్టీ.. అయితే, వరుస సమావేశాలు, సీనియర్లతో కూడా మంతనాలు జరిపి.. అందరినీ గాడీలోపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇదే సమయంలో, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో భేటీలు.. ఆయన ప్రతిపాదనలపై కీలక చర్చలు సాగుతున్నాయి.. అయితే, పీకే విషయంలో మాత్రం సమాధానం చెప్పడానికి…
Former TPCC President Uttam Kumar Reddy Fired on BJP and TRS Governments. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులను కేసీర్, మోడీ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన.. తుగ్లక్ పాలన లెక్క ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రబీలో 52 లక్షల ఎకరాల్లో సాగు చేశారు.. ఇప్పుడు 35 లక్షల వరకు సాగు చేశారన్నారు.…
వచ్చే నెల తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సీఎల్పీలో నేడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్ళందరూ రావాలని కోరుతున్నామని ఆయన పిలుపునిచ్చారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి…
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నేడు మరోసారి భేటి అయ్యారు. నిన్న ఉదయం నుంచి పీకేతో సీఎం కేసీఆర్ సాయంత్రం వరకు చర్చలు జరిపారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో పీకే చేరబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ అదిష్టానంతో పీకే వరుసగా మంతనాలు జరిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యల చేసిన…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిన్న గవర్నర్ తమిళిసైకి తెలంగాణలో సీట్లు బ్లాక్ చేస్తున్నారని బహిరంగ లేఖ రాశారు. లేఖలో మంత్రులు, ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీనిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణలో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుందని, బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామన్నారు. ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నామని ఆయన తెలిపారు. ఒక్క సీటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్…
బీజేపీ నేతలపై మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. నిన్న మొన్న రాష్ట్రంలో కొత్త బిచ్చగాళ్ళు తెలంగాణ ప్రజలపై అపారమైన ప్రేమను ఒలకబోస్తున్నారు. బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ను మోసం చేసిన చరిత్ర బీజేపీ ది. మూడు చిన్న రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే 2000 సంవత్సరంలో ఇన్ని బలిదానాలు అయ్యేవా అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాల వల్లే తెలంగాణ కు చాలా నష్టం జరిగింది. తెలంగాణ…