TPCC Working President and Congress MLA Jaggareddy Went to consult OU students, was Arrested.
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే దీనికి ఓయూ వీసీ, ప్రభుత్వం అనుమతి ఇంకా ఇవ్వలేదు. ఈ క్రమంలో అనుమతివ్వాలంటూ.. నేడు ఓయూ విద్యార్థులు మునిస్టర్స్ ముట్టడించారు.
అంతేకాకుండా మినిస్టర్స్ క్వార్టర్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డికి సెక్షన్ 151 కింద కూడా పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.