తెలంగాణలో111 జీవో రద్దు హాట్ టాపిక్ అవుతోంది. ఇంత హడావిడిగా ఎందుకు జీవో రద్దుచేయడం ఎందుకని అడిగితే.. సీఎంకి ధన్యవాదాలు తెలపాలన్నారు. గతంలో అంతా ఎన్నికల హామీగా మారిపోయింది. సీఎం దీనిని రద్దుచేయడం అభినందనీయం. 111 జీవో వల్ల రైతులు భూములు అమ్ముకోలేరు. బ్యాంక్ లోన్లు, ఇల్లు కట్టుకోలేరు. రైతులకు సీఎం కేసీఆర్ ఎంతో మేలుచేశారన్నారు మంత్రి సబిత. చీకటి నుంచి మనం వెలుగులోకి వచ్చాం. 25 సంవత్సరాల నుంచి వున్న జీవో ఇది. ఈ జీవో…
మహారాష్ట్రలో లౌడ్‌స్పీకర్ వివాదం ముదురుతోంది. ఈ నెల మొదట్లో ముంబై శివాజీ పార్కులో జరిగిన భారీ ర్యాలీలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే చేసిన సంచలన ప్రకటనతో వివాదానికి తెరలేచింది. మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలన్న ఆయన డిమాండ్ చుట్టూ నేడు మహా రాజకీయం తిరగుతోంది. లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు రాజ్ ఠాక్రే డెడ్‌లైన్ కూడా విధించారు. మే 3లోగా వాటిని తీసివేయకపోతే మసీదుల బయట బిగ్గరగా హనుమాన్ చాలీసా వినిపిస్తామని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దాంతో, గడువు సమీపించే…
బీజేపీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.. కాంగ్రెస్, బీజేపీ నేతల కళ్లకు పచ్చకామెర్లు సోకాయంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు ప్రతిపక్ష నేతలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏడేళ్ల బీజేపీ పాలనలో సామాన్యులపై ధరల భారం పెంచారని మండిపడ్డారు.. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా..?, తెలంగాణలో ఉన్నన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ రాష్ట్రంలోనైనా…
తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలతో సత్తా చాటి.. పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.. ఇక, తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించిన రాహుల్ గాంధీ.. మే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు నేతలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉండాలని చెబుతున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ…
ఖమ్మం రాజకీయాలను ఇప్పుడు మంత్రి పువ్వాడ అజయ్ హీటు పుట్టిస్తున్నారు.. బీజేపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం ఓవైపు అయితే.. మరోవైపు.. కాంగ్రెస్ నేతలపై కూడా వేధింపులు పెరిగాయంటూ జిల్లా నేతలతో పాటు.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి… పువ్వాడ ఓ సైకో అని కామెంట్ చేసిన ఆయన.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి పువ్వాడ…
భారత గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పుడు మునుపు ఎన్నడూ లేని విధంగా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు దేశంలో జరిగిన 49 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 39 ఎన్నికల్లో ఓటమి పాలైంది. అలాగే, సార్వత్రిక ఎన్నికలలో కూడా హస్తం పార్టీ ప్రదర్శన అధ్వాన్నంగా ఉంది. 2014లో 44 సీట్లు, 2019లో 52 స్థానాలు మాత్రమే గెలవటం ఆ పార్టీ దుస్థితికి…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. గ్రానైట్ వ్యాపారైన ఖమ్మంకు చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయ్యారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఇక, పీకే కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోన్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.. సోనియా-పీకే సమావేశంలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. అయితే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ సాగినట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.. గుజరాత్ పోల్స్‌పై చర్చించడానికే ఈ భేటీ జరిగిందని.. గుజరాత్‌తో…
సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి.. నా ఇష్టం నా రాజ్యాంగ అన్నట్లు సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం మోపుతున్నాయన్నారు.. మూడేళ్ల పాలనలో మద్యం రేట్లు మూడు వందల శాతం పెంచారంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు.. ఇక, మంత్రివర్గ విస్తరణలో సత్య సాయి జిల్లాకు సీఎం వైఎస్ జగన్ అన్యాయం…
ఆ నియోజకవర్గం నుంచి ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. లోక్‌సభ బరిలో నిలుచున్నా చేదు ఫలితమే. ఇప్పుడు నియోజకవర్గానికే రావడం లేదు. ఓటమి తీసుకొచ్చిన బాధో ఏమో.. పార్టీవర్గాల్లో మాత్రం చర్చగా మారిపోయారు ఆ యువనేత. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఏంటా కథా? కల్వకుర్తిలో నల్లపూసైన వంశీచంద్‌రెడ్డి చల్లా వంశీచంద్‌రెడ్డి. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే. AICC కార్యదర్శి. నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రావడం లేదట. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ 2014లో కల్వకుర్తి…