కలకుంట్ల మదన్ మోహన్‌రావు. తెలంగాణ కాంగ్రెస్ ఐటీ విభాగం ఇంఛార్జ్. గత లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలంగా మదన్ మోహన్ తీరు పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. కాంగ్రెస్ సీనియర్లను కాదని.. కార్యకర్తల ప్రమేయం లేకుండా కామారెడ్డి జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పార్టీలు సెగలు రేపుతోంది. ఈ దఫా ఆయన ఎంపీగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలపై ఆయన కన్నేసినట్టు టాక్.…
పార్టీలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సపోర్టు ఉంటే చాలూ చక్రం తిప్పొచ్చు… విజయపథంలో ముందుకు పోవచ్చనుకుంటారందరూ. అయితే ఇప్పటివరకు సలహాదారుడిగా ఉన్న పీకే… తాను డీల్ చేసుకున్న పార్టీల గెలుపు కోసం వ్యూహాలకు పదును పెట్టారు. భారత రాజకీయాల్లో రాజకీయ సలహాదారుడిగా తనకు సాటిలేరన్న స్థాయికి ఎదిగారు పీకే. అయితే, ఇంతకాలం వెనుకుండి చక్రం తిప్పిన ఆయన.. కాంగ్రెస్‌లో చేరనున్నారన్న ప్రచారం జోరుగా జరిగింది. పార్టీలోకి పీకేను తీసుకోవాలనే నిర్ణయం దాదాపు ఫైనల్ అయింది. కాంగ్రెస్‌లో…
ఖమ్మంలో పర్యటించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రి పువ్వాడ అజయ్‌పై విరుచుకుపడ్డారు.. ఆయనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.. ఇక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ రేణుకాచౌదరి కూడా పువ్వాడను టార్గెట్ చేశారు.. అయితే, రేవంత్, రేణుకాకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. రేవంత్ రెడ్డి ఒక ఐటమ్‌గా పేర్కొన్న ఆయన.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి పోటీచేసిన సందర్భంలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలు వదిలి పెడతా అని చెప్పాడు..…
అంతా అయిపోయింది.. ఇక, కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే తరువాయి.. వరుస ఓటములు చూస్తోన్న హస్తం పార్టీ.. గాడిలో పడుతోంది.. పూర్వ వైభవం వస్తుంది.. అంటూ అనేక విశ్లేషలు వచ్చాయి.. ఇలా ఈ మధ్య చర్చ మొత్తం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గురించే జరిగింది.. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పుల కోసం కీలక సూచనలు చేసిన ఆయనను.. పార్టీలో చేర్చుకోవడంపై సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. కొందరు నేతలు వ్యతిరేకించినా..…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారానికి తెరపడింది… కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి, పార్టీ అధినేత్రి నుంచి సానుకూలత వ్యక్తం అయినా.. చివరకు పార్టీలోకి రావాలంటూ పీకేను సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు పీకే.. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతో, గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న…
ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్‌ను టార్గెట్ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య అక్కడ జరిగిన ఘటనల్లో మంత్రిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కాగా.. అజయ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు రేవంత్.. సీబీఐ విచారణకు నువ్వే లేఖ రాయి అంటూ పువ్వాడ అజయ్‌కు సవాల్ విసిరారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.. అలాంటి సైకోకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల…
గత కొంతకాలంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై పెద్ద చర్చ జరుగుతోంది.. దానికి కారణం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపపడం.. దీనిపై కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘమైన చర్చ కూడా సాగింది.. పీకే ముందు కండిషన్ల లిస్ట్ కూడా కాంగ్రెస్ పెట్టింది.. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిరాకరించారు పీకే.. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామంటూ కాంగ్రెస్ నేత…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, సభలపై రేవంత్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందేకాగా.. వాటిపై స్పందించిన డీకే అరుణ.. జోగులాంబ సాక్షిగా ప్రమాణం చేద్దామా? అమ్మవారి ఎదుట బండి సంజయ్ పై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? అని చాలెంజ్ చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి పిచ్చి ప్రేలాపనలు చేస్తారా? అని మండిపడ్డ ఆమె.. టీఆర్ఎస్ –…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారిగా ఆయన ఖమ్మం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ విజయవంతం కోసం కార్యకర్తలతో మాట్లాడనున్నారు. వరంగల్ లో వచ్చే నెలలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సభ జరుగనుంది. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున కార్యకర్తలను తరలించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ…