Balmoori Venkat: బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వీసీని నియమించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసర ట్రిపుల్ ఐటీకి శాశ్వత వైస్ ఛాన్సలర్‌ను వెంటనే నియమించి, విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బాసర ట్రిపుల్ ఐటీ లోపల చేసిన శాంతియుత పోరాటాన్ని పోలీసులు భగ్నం చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి మాట్లాడుతూ.. బాసర ట్రిపుల్ ఐటీలో శాశ్వత వీసి లేనందున అక్కడి విద్యార్థులు నిత్యం సమస్యల ఉబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే శాశ్వత వైస్ ఛాన్సలర్ ని నియమించి అదే విధంగా బాసర ట్రిపుల్ ఐటీ లోని కరెంట్ కోతలు, మంచి నీటి కొరత, నాణ్యత లేని ఆహార సమస్యలపై వెంటనే దృష్టి సారించాలన్నారు. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం వైస్ ఛాన్సలర్ నియామకంలో జరుగుతున్న జాప్యమేనని,కావున బాసర ట్రిపుల్ ఐటీకి వెంటనే శాశ్వత వైస్ ఛాన్సలర్ ని నియమించి అక్కడ విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాల్సిందిగా వెంకట్ బల్మూరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వేణు రాజు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..