హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మైనర్ రేప్ కావడంతో పొలిటికల్ గానూ రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. రేప్ కేసులో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు పాత్ర ఉందని పోలీసులు తేల్చారట. కేసు పూర్తి విచారణ అయితేగాని ఎవరి పాత్ర ఏమిటో తేలే అవకాశం ఉంది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్…
తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ బాలికపై అత్యాచార ఘటన కేసు రోజు రోజుకు విచిత్రంగా మారుతోందన్నారు. రాజకీయ నాయకుల పిల్లలను కాపాడాలని పోలీసులు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా మూడు రోజుల వరకు ఎందుకు పట్టించుకోలేదని గీతారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. పబ్స్ కి , డ్రగ్స్ కి హైదరాబాద్ హబ్ గా మారిందన్నారు. అసలు పబ్స్ కి అనుమతులు…
కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మూడు చింతలపల్లిలో పర్యటించారు. మంత్రి మాల్లారెడ్డితో కలిసి మూడు చింతలపల్లిలో రూ.15 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి, 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణం, 13.5 లక్షలతో…
ఒక్క రక్తపు బొట్టు నేల చిందకుండా సాకారమైన ఆశయం. పిల్లల నుంచి పెద్దల వరకు, స్కూల్ విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయం స్కాలర్ వరకు, కూలీ నుంచి ఉన్నతాధికారి వరకు, ప్రతి ఒక్కరూ ఉద్యమ పతాకలైన సందర్భం తెలంగాణ ఉద్యమం. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు… కొన్ని రక్తపు నేలలపై నడిచి యుద్ధాలుగా ముగిశాయి. కొన్ని లక్ష్య తీరాలను చేరి.. శాంతి పోరాటాలుగా భాసిల్లాయి. భారత స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఈ రెండు మార్గాలూ కనిపిస్తాయి. అతి, మిత వాదుల…
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2018లో అధికారపార్టీ టికెట్‌పైనే పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారా లేక కొత్త వారు బరిలో ఉంటారా? అనే ప్రశ్న చుట్టూనే మక్తల్ గులాబీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్మోహన్‌రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరు రేస్‌లోకి రావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గత…
సూర్యాపేట కాంగ్రెస్‌లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఓ రేంజ్లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది. రమేష్‌రెడ్డిపై ఆ మధ్య…
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. వరసగా పార్టీలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దశాబ్ధాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ వరసగా ఎన్నికల్లో విఫలం అవుతుండటం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని బలహీన పరుస్తున్నాయి. దీనికి తగ్గట్లుగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. చింతన్ శిబిర్ తర్వాత కూడా పార్టీ నామామాత్రపు చర్యలకే పరిమితం అయింది. పార్టీ తీరుతో విసిగిపోయిన చాలా మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ పార్టీలో చేరుతున్నారు.…
ఒక నాయకులు కోడంగల్ లో తంతే మల్కాజ్ గిరిలో వచ్చిపడ్డాడు. ఆయనది ఐరన్ లెగ్ తెలుగు దేశంను నాశనం చేశాడు.. ఇప్పుడు కాంగ్రెస్ ను నాశనం చేయబోతున్నాడంటూ.. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. కోస్గిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తడో తెలియదు కానీ.. ఈరోజు మన పాలనలో దేశంలో 24గంటల కరెంట్ ఇస్తుంది మన రాష్ట్రమే అని ఆయన అన్నారు. 10 సార్లు అవకాశం ఇస్తే దేశాన్ని 50…
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం.…