బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటేనని.. ఇదంతా అమిత్‌షా నడుపుతున్న డ్రామా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కెమెరా ముందు విమర్శలు చేసుకుంటున్నట్టు ఆ రెండు పార్టీలు నటిస్తున్నాయని.. తెరవెనుక చాలా తతంగాలు నడుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తోన్న అమిత్‌షా.. ఆయనకు ఈడీ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, ఒకవేళ బీజేపీకి 10 నుంచి 15 సీట్లు వస్తే తాను…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్లో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు రాజకీయాలు మారుతున్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య అంతర్గత పోరు మరోసారి బయట పడింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తీగల.. చెరువులు, పాఠశాల స్థలాలు కబ్జా చేస్తున్నారని.. వాటిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా మీర్‌పేటలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూనే.. అసలు సబితా తమ పార్టీలో గెలిచిన వ్యక్తి కాదని విమర్శల…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పీజేఆర్ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉండేది. పార్టీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తే.. పీజేఆర్ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్ మరణం తర్వాత ఆ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి…
మరోమారు రాష్ట్రానికి రాహుల్ గాంధీ రానున్నారు. కేటీఆర్ ఇలాకా టార్గెట్ గా ఎంచుకున్నారు రాహుల్. కాగా.. సెప్టెంబర్ లో మరోసారి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ రానున్నారు. అయితే.. మంత్రి కేటీఆర్ నియోజకర్గమైన సిరిసిల్లకు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. కాగా.. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. ఇది ఇలావుండగా.. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు…
సంచలన నిర్ణయానికి ఇంకా సమయం ఉందని.. అది ఏదైనా కాంగ్రెస్ పార్టీ మంచికోసమేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. జగ్గారెడ్డి పార్టీ కోసమే మాట్లాడతారని.. పార్టీ ఎదుగుదల కోసమే మాట్లాడతారని ఆయన తెలిపారు. తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్ ఎదుగుదల కోసమే మాట్లాడతానన్నారు. పార్టీలో ఉంటాడా.. పోతాడా అనేది మనసులో నుంచి తీసేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు తన వ్యాఖ్యలను నెగెటివ్‌గా తీసుకోవద్దన్నారు. TS Police Jobs: కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల తేదీలు ఖరారు.. జగ్గారెడ్డి ఇక్కడే…