తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెంచింది. వరస చేరికలతో హుషారుగా కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే ప్రజా సమస్యలపై అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. దీంతో పాటు ఇటీవల కాలంలో వరసగా పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ సభకు రాహుల్ గాంధీ రావడం, రైతు డిక్లరేషన్ ప్రకటించడంతో పాటు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడం కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్…
టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంపై సంచలన ఆరోపణలు చేశారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదుయాష్కీ గౌడ్… ఆ మూడు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించిన ఆయన.. దేశంలో ఎక్కడ మతతత్వ అల్లర్లు జరిగిన హైదరాబాద్ తోనే లింక్ ఉంటుందన్నారు.. ఇక, ఇలాంటి సంఘటనలలో కేంద్రం సమగ్రమైన విచారణ జరిపించడంలో విఫలమైందని మండిపడ్డారు మధుయాష్కీ గౌడ్.. మరోవైపు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో జరిగిన సంఘటనలలో నిందితులకి భారతీయ జనతా పార్టీ వాళ్లతో లింకులు ఉన్నాయని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత..…
రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం కే. లక్ష్మణ్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన లక్ష్మణ్.. తెలంగాణ సీఎం కేసీఆర్పై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీ అని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, ప్రధాని మోదీని ప్రశ్నించే స్థాయి ఆయనకు లేదని విమర్శించారు. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, ఎంఐఎంకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు. టీఆర్ఎస్లో వెన్నుపోటు పొడిచేందుకు కట్టప్పలు సిద్ధంగా ఉన్నారని, ఈ కట్టప్పల…
వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి, వైఎస్సార్టీపీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సర కాలంలో తమ పార్టీ ఎంతో పురోగతి సాధించిందని.. తెలంగాణ ప్రజలకు నిజమైన పక్షంగా నిలబడిందని అన్నారు. తాము చేస్తోన్న దీక్షల వల్లే పాలక పక్షానికి బుద్ధి వచ్చిందన్నారు. పార్టీ పెట్టకముందే నిరాహార దీక్ష చేశానని చెప్పిన షర్మిల.. ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తూనే ఉంటానన్నారు. ఇప్పటివరకూ 1500 కిలోమీటర్లు…
enior Congress leader Anand Sharma scotched speculation about his meeting with BJP president JP Nadda on Thursday, saying if he had to, he would do so openly as they both are from Himachal Pradesh and studied at the same university.
ప్రముఖ రాజకీయ నాయకుడు, బాలీవుడ్ యాక్టర్ రాజ్ బబ్బర్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది యూపీ లక్నో కోర్టు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. అతనిపై దాడి చేసిన కేసులో తాజాగా లక్నో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. మే 1996లో ఎన్నికల సందర్భంగా పోలింగ్ అధికారిపై రాజ్ బబ్బర్ దాడి చేశాడు. ఈ ఘటనపై యూపీలోని వజీర్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. 1996 ఎన్నికల సమయంలో…
తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలుస్తుందని.. పార్టీ సర్వేలో అదే తేలిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ను ఢీకొట్టే పరిస్థితి బీజేపీకి ఏమాత్రం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన కొందరు కోట్లు సంపాదించారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్లు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు తాము బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పార్టీ బలమే కార్యకర్తలని వెల్లడించారు.…
కొంతకాలం నుంచి సందిగ్ధతకు తెరదించుతూ.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. దీంతో బీజేపీకి గట్టి షాక్ తగిలినట్టయ్యింది. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరికలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. అయితే.. ఎర్రశేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యతిరేకించారు. ఈ చేరికకు దూరంగా ఉన్న ఆయన.. నేరచరిత్ర కలిగిన అతడ్ని కాంగ్రెస్లో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. తమ్ముడిని చంపాడన్న ఆరోపణలు…