మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ సంచలన జోస్యం చెప్పారు.. భవిష్యత్తులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా సీఎం అవుతారని 2003లోనే తాను చెప్పానని గుర్తుచేసుకున్న ఆయన… భవిష్యత్తులో వైఎస్ బిడ్డ షర్మిల సీఎం అవుతుందన్నారు.. ఇవాళ మాజీ పీసీసీ చీఫ్,మాజీ రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ను పరామర్శించారు వైఎస్ షర్మిల.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. కాసేపు ఆయనతో చర్చించారు.. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, దేశ రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుండగా.. ఈ సందర్భంగా డీఎస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ తో ఉన్న పాత అనుభవాలను గుర్తు చేసిన డీఎస్.. తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదర కుండా ఉందని చెప్పారు.. సరైన టైం లో ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉండబోతుందన్న ఆయన.. షర్మిల ఒక ఐరాన్ లేడీగా అభివర్ణించారు. నా రాజకీయ అనుభవంతో చెబుతున్నా.. షర్మిల ముఖ్యమంత్రి అవుతుందన్నారు.. భవిష్యత్ లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి తప్పకుండా అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు డి. శ్రీనివాస్.
Read Also: YS Sharmila: మీకేమో గానీ.. నాకైతే మండింది..!
కాగా, వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. ఏ అంశాన్ని వదలకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.. నిరుద్యోగుల సమస్యలపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఆమె.. ప్రతీవారం దీక్షలు చేస్తూ వచ్చారు.. ఇక, పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న ఆమె.. ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీచేస్తామని గతంలోనే ప్రకటించిన ఆమె.. ఖమ్మం జిల్లాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.. ఇక, వైఎస్ షర్మిలకు తోడుగా ఉండేందుకు.. తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఈ మధ్యే రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ విజయమ్మ ప్రకటించిన విషయం తెలిసిందే.