తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. మునుగోడులో విజయం మాదేఅంటుంది భారతీయ జనతా పార్టీ.. గత ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే.. మునుగోడులోనూ బీజేపీ జెండా పాతేస్తాం అంటున్నారు.. ఇక, మునుగోడులో సర్వేలన్నీ…
జార్ఖండ్‌లో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సర్కారు నెగ్గింది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ వల్లనే నలుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమిక విచారణలో తేలింది. ఆపరేషన్‌కు ఉపయోగించే పరికరాలు పాతవి కావడంతో ఈ తరహా చిక్కులు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్‌లో 19 మంది మహిళలు, మరో పది మందికి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం…
గత వారం కాంగ్రెస్ నుంచి వైదొలిగిన గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ "అర్ధరహితంగా" ఉందని ఆరోపించారు. జీ23 లెటర్ రాయడమే రాహుల్ ఆగ్రహానికి కారణమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని, తన అవసరం లేదని కాంగ్రెస్ అనుకుందని.. అందుకే న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లోనే కొత్త పార్టీ స్థాపిస్తారని.. గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితుడైన జీఎం సరూరీ వెల్లడించారు.