Revanth Reddy: 1980 లో పుట్టిన బీజేపీ అయినా… 2001 లో పుట్టిన టీఆర్‌ఎస్ అయినా మమ్మల్ని పొగిడి తీరాల్సిందే.. చరిత్ర ఉన్నది మాకే అన్నారు రేవంత్ రెడ్డి. ట్విట్టర్ టిల్లు పొగిడింది కూడా అందుకే అని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్ లో కేంద్రం అధికారిక వేడుక కాదు.. కేవలం టూరిజం శాఖ మాత్రమే చేస్తుందని అన్నారు. కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చిందా..? అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి ఇదో ప్రయత్నం అని రేవంత్ విమర్శించారు. అక్టోబర్ 2 నుండి పాదాభి వందనం.. మునుగోడు లో ఉన్న అందరినీ కలుస్తారు, ట్రైనింగ్ కూడా ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. కాళ్ళు మొక్కి ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యం అవ్వండి అని ప్రజల్ని అడుగుతామన్నారు. మునుగోడు ఎన్నికల ద్వారా టీఆర్‌ఎస్, బీజేపీ కి చెక్ పెట్టాలని పిలుపు నిచ్చారు.
సెప్టెంబర్ 17 గొప్ప స్వాతంత్ర్య దినోత్సవం అని అన్నారు. చరిత్ర లేని వాళ్ళు… యుగ పురుషులు లేని వాళ్ళు మాట్లాడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నీ బీజేపీ దొంగతనం చేస్తుందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నీ నిషేధించారని, చరిత్ర నూ..నాయకులను బీజేపీ దొంగ తనం చేస్తుందని మండిపడ్డారు. అమిత్ షా సభకు 1500 మంది కూడా లేదని ఎద్దేవ చేశారు. ఎందుకంటే.. ఈ చరిత్ర లో బీజేపీ లేరు కాబట్టి జనం కూడా లేదని అన్నారు. గుజరాత్ లో ఉన్న రాజు.. హైదరాబాద్ నిజాం రాజు..జమ్ము రాజు అంతా ఒకరే అని రేవంత్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వచ్చిన ఏడాది కి ఈ మూడు ప్రాంతాలకు స్వాతంత్య్రం వచ్చిందని రేవంత్ తెలిపారు. గుజరాత్ లో జునే ఘాడ్ లో ఎందుకు వజ్రోత్సవాలు చేయరు అని ప్రశ్నించారు. తెలంగాణ కి వచ్చి హడాహుడి ఎందుకు చేస్తుంది? అని రేవంత్ ప్రశ్నించారు.
గుజరాత్ లో రాజు నుండి జునే ఘడ్ కి స్వాతంత్య్రం వచ్చిందని తెలిపారు. అక్కడి నుండి వచ్చిన అమిత్ షా ఎందుకు వేడుకలు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అక్కడ 75 యేండ్ల వజ్రోస్త వాలు చేయదు ఎందుకు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గుజరాత్ లో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా?. అక్కడ ఎందుకు వేడుకలు చేయరన్నారు రేవంత్ రెడ్డి. ముందు జునేఘద్ లో ఉత్సవాలు చేయండి? అని సలహా ఇచ్చారు. గుజరాత్ మంత్రులు హైదరాబాద్ పై కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ కల్లోలాలు పెట్టీ.. ఇక్కడి పెట్టుబడి దారులను గుజరాత్ తీసుకెళ్లే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు రేవంత్. అసలు అసద్ ఎవరు? తెలంగాణకు అసద్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆయన్ని భూతంగా పెట్టీ తెలంగాణను అక్రమించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. భాగస్వామ్యం లేని పాత్ర పోషిస్తా అంటే జనం ఊరుకోరన్నారు. లగడ పాటి వచ్చి తెలంగాణ ఉద్యమం నేనే చేసిన అంటే ఎలాగా ఉంటుందో.. అమిత్ షా సెప్టెంబర్ 17 పేరుతో సభ పెడితే కూడా అలాగే ఉంటుందని వ్యంగాస్త్రం వేసారు రేవంత్ రెడ్డి. అందుకే అమిత్ షా సభకు జనం రాలేదన్నారు. చరిత్ర వక్రీకరిస్తాం అంటే ప్రజలు హర్షించరని రేవంత్ పేర్కొన్నారు.
Revanth Reddy: చరిత్రలో బీజేపీ లేదు.. అమిత్ షా సభకు జనం లేరు