జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాకు మద్దతుగా కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీరుతో విసుగు చెంది పార్టీకి రాజీనామా చేసిన కశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్మూ కశ్మీర్లో కొత్తగా పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. బీజేపీలో చేరకుండా.. జమ్మూకశ్మీర్‌లో సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ఆజాద్ సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, కాంగ్రెస్ నేతృత్వంలో పలు కీలక హోదాల్లో పని చేసిన 73 ఏళ్ల వయసున్న ఆజాద్.. దాదాపు 50 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో కొనసాగిన అనుబంధాన్ని తెంచేసుకున్నారు. గత రెండు మూడేళ్లగా కాంగ్రెస్ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని ప్రదర్శించారు. మరో వైపు తాను బీజేపీలో చేరిక మీడియా ఊహాగానాలపై వ్యంగ్యం ప్రదర్శించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ బుధవారం అన్నారు. ప్రస్తుతం తనకు రెండు పనులు అప్పగించబడ్డాయని ఆయన తెలిపారు.
ఐదారేళ్లలో భారతీయ జనతా పార్టీ కనుమరుగు అవుతుందంటూ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) ఎమ్మెల్యే కరీముద్దిన్ బర్భూయా సంచలన వ్యాఖ్యలు చేశారు.. బీహార్ నుంచే బీజేపీ పతనం ఆరంభమైందని.. బీజేపీని మరోసారి ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని జోస్యం చెప్పారు.. మరోవైపు.. సెప్టెంబరు 2న పలువురు కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరతారని ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యే కరీం ఉద్దీన్ బర్భూయా ప్రకటించారు. బార్పేట జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర ప్రధాన…
Manickam Tagore: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ పార్టీలు పోటాపోటీగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నాయి. దీంతో.. అటు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ర్యాలీలు.. సభలతో ప్రదర్శిస్తుంటే, మరోసారి మునుగోడులో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ మునుగోడులో తమ పార్టీని మరోసారి గెలిపించేందుకు అన్ని మార్గాలను వెతుక్కుంటోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈనేపథ్యంలో..తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశలో కాంగ్రెస్…
రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండాలని బలవంతంగా ఒప్పించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం రాహుల్ గాంధీకి ఇష్టం లేకపోతే.. ఆ పదవి చేపట్టేలా ఆయనను బలవంతం చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నూతనంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య సోనియా గాంధీ రాష్ట్రపతిని కలిశారు.