బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తోన్న వేళ కాంగ్రెస్ భారత్ జోడో యాత్రను విమర్శించే క్రమంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను విమర్శించే క్రమంలో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను తిరిగి మన దేశంలో కలపాలంటూ ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.
024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం తన మెగా భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్ర పార్టీ పునరుజ్జీవనానికి దోహదపడుతుందని జి-23 నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పార్టీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారు.
తమిళనాడుకు తనకు ఎంతో అనుబంధం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తమిళనాడులో కన్యాకుమారి వద్ద 'భారత్ జోడో యాత్ర'ను ప్రారంభించిన అనంతరం గాంధీ మండపం వద్ద బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించారు. భారత్ జోడో యాత్రకు ఇక్కడి సముద్రం, ఆహ్లాదకర వాతావరణం జోష్ నింపుతోందన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు.
మధ్యాహ్న భోజన కుంభకోణంలో రాజస్థాన్ హోం, ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజేంద్ర యాదవ్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లు రాలేదని కేంద్ర మంత్రులు అంటున్నారు, ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు... వాళ్లు మీ వైపు వస్తే మీ చెరువులో ముంచండి.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయో లేదో తెలుస్తుందని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు
తెలంగాణ ఇప్పుడు ప్రధానంగా సెప్టెంబర్ 17వ తేదీపై చర్చ సాగుతోంది.. విమోచనం అని ఒకరంటే.. విలీనమని మరొకరు.. ఇలా సెప్టెంబర్ 17పై రచ్చ సాగుతోంది.. అయితే.. . సాయుధ పోరాటంలో పాల్గొన్నది కాంగ్రెస్.. కమ్యూనిస్టులే… మిగతా వాళ్లు అప్పటికీ పుట్టనేలేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… బీజేపీ, టీఆర్ఎస్ పుట్టకముందే పోరాటం చేసింది కాంగ్రెస్ అన్న ఆయన.. నిజాం రాజ్యం ఏలుతుంటే.. సైనిక చర్యతో స్వాతంత్య్రం ఇప్పించింది కాంగ్రెస్ అని.. ఇవి స్వాతంత్ర్య ఉత్సవాలు అన్నారు రేవంత్.. ఇక,…