భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని.. బీజేపీ టార్గెట్ చేస్తోంది.. పాదయాత్రలో ఉపయోగిస్తున్న కంటైనర్ల నుంచి అనేక రకాల విమర్శలు సందిస్తున్నారు.. అంతేకాదు.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.. అయితే, రాహుల్ గాంధీ టీ షర్ట్ మీద బీజేపీ మాట్లాడి దిగజారుడు పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీని ఏం విమర్శించాలో అర్దం కాక.. టీ షర్ట్ మీద విమర్శలు చేస్తున్నారని…
రాజ్‌పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ శనివారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని రాజ్భవన్లను కూడా కర్తవ్య భవన్లుగా మార్చకూడదా అని ప్రశ్నించారు.
మందు తాగేవాళ్లతోనే ఉండను.. అలాంటిది మందు వ్యాపారం చేస్తానా..? అంటూ ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తనకు సంబంధాలున్నాయంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ఫైర్ అయ్యారు… అన్నదమ్ములు చెరో పార్టీలో ఉండొచ్చు కానీ, తన బంధువు ఎవరో వ్యాపారం చేస్తే… దాంతో తనకేంటి సంబంధం అన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంలో ప్రభుత్వం బీజేపీదే కాబట్టి.. దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. లిక్కర్ స్కాం పై బీజేపీ బుద్దిలేని ప్రచారం చేస్తోందని మండిపడ్డ ఆయన.. కోతికి…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నికలు వస్తుండగా… తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి దూకుడు పెంచింది… అధికార పార్టీ కంటే ముందే.. తమ అభ్యర్థిని ప్రకటించింది.. ఇప్పటికే పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు కమిటీలు వేస్తూ.. మరింత దూకుడు చూపిస్తోంది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి… మునుగోడు ప్రచార బాధ్యతలు మధు యాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, జీవన్…
హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న అసోం సీఎం హేమంత్ బిస్వాల్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.. గణేష్ నిమజ్జనంలో రాజకీయాలు మాట్లాడడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు నేతలు.. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. గణపతి నిమజ్జనంలో హైదరాబాద్ నెంబర్ వన్ అని స్పష్టం చేసిన ఆయన.. నిమజ్జనానికి వచ్చిన హేమంత్ బిస్వాల్.. రాజకీయం మాట్లాడటం సరికాదని హితవు పలికారు.. రాజకీయాలు ఉంటే పార్టీ ఆఫీస్…
Bharat Jodo Yatra.. Rahul Gandhi in another controversy: భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. గతంలో భారతదేశాన్ని, హిందూ మతాన్ని తక్కువ చేస్తూ మాట్లాడిని వివాదాస్పద క్రైసవ మతగురువు జార్జ్ పొన్నయ్యతో భేటీ అయ్యారు. అయితే దీనిపై బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టింది. భారత్ తోడో( భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయండి) గుర్తులతో భారత్ జోడోనా..? అని ప్రశ్నించింది. వివాదాస్పద జార్జ్ పొన్నయ్యను రాహుల్ గాంధీ కలవడంపై బీజేపీ…
కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఈరోజు తాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇచ్చారు. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగినప్పుడు (కాంగ్రెస్) అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది స్పష్టమవుతుందన్నారు.
కాంగ్రెస్‌తో తన ఐదు దశాబ్దాల అనుబంధాన్ని ఇటీవలే ముగించుకున్న మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, తన మాజీ పార్టీకి చెందిన నాయకులు తనపై క్షిపణులు ప్రయోగించినప్పుడు మాత్రమే తాను రైఫిల్‌తో ప్రతీకారం తీర్చుకున్నానని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో మూడో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం కాగా.. స్కాట్ క్రిస్టియన్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.