తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. అయితే.. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలో ఏ విషయమైన ప్రాధాన్యత సంచరించుకుంటోంది. అయితే.. ముందు నుంచి అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను కేటాయించవద్దని కోరింది. ఈ విషయమై టీఆర్‌ఎస్ పార్టీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. అయితే.. తాజాగా గతంలో రద్దు చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి మునుగోడు ఉప ఎన్నికలో ఓ అభ్యర్థికి కేటాయించడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.
Also Read : Telangana Heavy rain: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు
కారును పోలిన గుర్తులను రద్దు చేయాలని కోరుతుంటే.. గతంలో రద్దు చేసిన గుర్తును కూడా ఇప్పుడు కేటాయించడమేంటని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే.. కేంద్ర ఎన్నికల పరిశీలకులు రంగంలోకి దిగి విచారించారు. అంతేకాకుండా.. రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంపై ఆర్వో వివరణ ఇవ్వాలని కోరింది. ఇదే సమయంలో.. ఆర్వోపై వేటు వేసిన కేంద్రం ఎన్నికల సంఘం మిర్యాల గూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతను అప్పగించింది. అయితే.. మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ వచ్చే నెల 3న జరుగనుండగా, 6న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.