Bengaluru: బెంగళూర్ లో భారీ వర్షం.. నీటిలో మునిగిన రోడ్లు, కార్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain in Bengaluru, Many Roads Flooded, Cars Damaged: బెంగళూర్ నగరం వరసగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గత నెల కురిసిన వర్షాల కారణంగా చాలా ఏరియాలు నీటిలో మునిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బుధవారం బెంగళూర్ నగరంలో భారీ వర్షం కురిసింది. బెల్లందూర్ బెల్లందూరు ఐటీ జోన్‌తో సహా నగరంలోని తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. రాజమహల్ గుట్టహళ్లిలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు రోజుల పాటు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read Also: United Nations: భారత్ ప్రతిపాదనను నిలిపేసిన చైనా.. పాకిస్తాన్ ఉగ్రవాదికి మద్దతు
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి భారీగా వరద నీరు చేసింది. పలు రెసిడెన్షియల్ భవనాల్లోకి నీరు చేసింది. సెల్లార్ లోనే ఉన్న కార్లు అన్నీ నీటమునిగాయి. సాయంత్రం సమయంలో భారీ వర్షం కురవడవంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా చాలా మంది ప్రజలు మెట్రో స్టేషన్లలో తలదాచుకునే పరిస్థితి ఏర్పడింది.
గత నెలలో కురిసిన భారీ వర్షాలు బెంగళూర్ నగరాన్ని వణికించాయి. ఈ వర్షాలు రాజకీయంగా కర్ణాటకలో చిచ్చు పెట్టాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య విమర్శలు చెలరేగాయి. గ్లోబల్ ఐటీ కంపెనీలు ఉన్న ప్రాంతాలతో పాటు నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో నగర జనజీవితం అస్తవ్యస్తం అయింది. ఆ సమయంలో అనేక కాలనీలు నీటిలో చిక్కుకున్నాయి. నీటిలో మునిగిన ఖరీదైన కార్లు అప్పట్లో సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. రుతుపవన కాలం ప్రారంభం అయినప్పటి నుంచి బెంగళూర్ లో భారీ వర్షాలు కురిశాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 1706 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. 2017లో 1696 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!