Mallikarjun Kharge: 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని, కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమికి నేతృత్వం వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భావసారుప్యం ఉన్న పార్టీలతో చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ప్రధాని మోదీ అనేక సార్లు దేశాన్ని ఎదుర్కొనే ఏకైక వ్యక్తిని నేను, ఇతర వ్యక్తులు నన్ను తాకలేరని అన్నారని, ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా అనరని, మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, నియంత కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. మీరు ప్రజలతో ఎన్నుకయ్యారు, వారే మీకు…
Off The Record: తెలంగాణలోని హాట్ సీటుల్లో దుబ్బాక నియోజకవర్గం కూడా ఒకటి. 2018 ఎన్నికల వరకు ఇదో సాధారణ సెగ్మెంటే అయినా… తర్వాత జరిగిన ఉపఎన్నికతో ఎక్కడలేని హైప్ వచ్చేసింది. దాంతో దుబ్బాకలో చీమ చిటుక్కుమన్నా.. ఏ పార్టీలో ఏం జరిగినా హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా దుబ్బాక కాంగ్రెస్‌లో నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో గందరగోళానికి దారితీస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎవరికివారు టికెట్ తమకే అని ప్రచారం చేసుకుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న…
Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరికి ఎందుకు పదవులు వస్తాయి అనేది పార్టీ శ్రేణులకు, లీడర్స్‌కు అంతుచిక్కడం లేదు. పార్టీ కోసం పని చేసిన వారికి.. పదవులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయని… ఇటీవలే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఇటీవల పార్టీలో భర్తీ అయిన పదవుల్లో ఈ ఫార్మలా వర్కవుట్ అయినట్టు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా ఏఐసీసీ సభ్యుల నియామకంలో జరిగిన పరిణామాలను చూస్తే అది అర్థం అవుతోంది. ఏఐసీసీ సభ్యుల…
Tipu Sultan Issue: కర్ణాటక ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అక్కడ మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టిప్పు సుల్తాన్ ను సమర్థిస్తూ కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుండగా.. బీజేపీ టిప్పు సుల్తాన్ ను విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు టిప్పు పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై టిప్పు వారసులు స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం టిప్పు సుల్తాన్ పేరు ఉపయోగించవద్దని.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Maoists warning letter to Congress: మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని చెబుతూ చత్తీస్ ఘడ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పశ్చిమ బస్తర్ డివిజన్ మావోయిస్టు కమిటీ కార్యదర్శి మోహన్ పేరుతో లేఖను విడుదల చేశారు. చత్తీస్ ఘడ్ లో సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించింది మావోయిస్టు…
Parliament: ప్రతిపక్ష ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ సీరియస్ అయ్యారు. సభా నియమాలను, సభా హక్కులను ఉల్లంఘించారనే ఆరోపణల నేపథ్యంలో 12 మంది ప్రతిపక్ష ఎంపీల పేర్లను రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీకి సిఫారసు చేశారు. ఇందులో 9 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండగా, ముగ్గురు ఆప్ ఎంపీలు ఉన్నారు. కమిటీ పరిశీలించి, దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని జగ్దీప్ ధన్ఖర్ ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎంపీలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.