Manik Rao Thakre : పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హత్ సే హాత్ జోడో పేరిట తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. మంగళవారం రాత్రి భూపాలపల్లిలో నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లతో, టమాటాలతో దాడి చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు దువ్వారు. దీనితో యాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక రేవంత్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు థాక్రే మాట్లాడుతూ.. ఇలాంటి దాడులు దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతలు దాడులను నమ్ముకొని ఉన్నారన్నారు. కాంగ్రెస్ యువ నాయకున్ని చంపాలని చూసారని ఆయన మండిపడ్డారు.
Also Read : Icon Star: ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ అరుదైన రికార్డ్!
Also Read
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
చనిపోయాడని అనుకొని వెళ్ళిపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దోషులను పట్టుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసలు దోషులెవరో అందరికీ తెలుసు అని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వం ఎవరు ప్రశ్నించొద్దని అనుకుంటోందని, తమ తప్పులను, అక్రమాలను ప్రశ్నించొద్దని దాడులకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ దాడులను తీవ్రంగా ఖండిస్తోందన్నారు థాక్రే. పేదప్రజలకు న్యాయం అందాలని, రాష్ట్రం అభివృద్ది చెందాలని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని, కానీ ఇంతటి దుర్మార్గ పాలన నడుస్తుందని అనుకోలేదన్నారు. బీఆర్ఎస్ చర్యలను ప్రజలు గమనించాలన్నారు. అన్యాయాలు, అత్యాచారాలు తెలంగాణలో పెరిగిపోయాయని, యువత ఆందోళన వదలండి, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Also Read : Election Results: ఈశాన్య భారతంలో రెపరెపలాడిన కాషాయ జెండా.. మరోసారి సత్తాచాటిన బీజేపీ
తాజావార్తలు
-
Redmi K100: రెడ్ మీ K100 లాంచ్ ఖాయం.. 10,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్!
-
Heroes Turn Villains: విలన్లుగా మారిన స్టార్ హీరోలు.. అసలు ప్లాన్ తెలిస్తే షాకే!
-
Tiger Shroff: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. బుల్లెట్ తగిలిందా?
-
YS Jagan : రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలి
-
Para Asian Games 2026: భారత అథ్లెట్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు.. దేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!