Rajnath Singh On Rahul Gandhi: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ సాయుధబలగాల పరాక్రమాన్ని ప్రశ్నిస్తున్నారంటూ మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నానని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో నందగఢ్ లో బీజేపీ ‘‘విజయ్ సంకల్ఫ్ యాత్ర’’ రెండో విడతను ప్రారంభించిన ఆయన, వచ్చే కర్ణాటక ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.
Read Also: First Night Video: హయ్ ఫ్రెండ్స్.. మా ఫస్ట్ నైట్ వీడియో షేర్ చేస్తున్నా.. లైక్ చేయండి
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రారంభించేందుకే భారత్ జోడో యాత్ర ప్రారంభం అయిందని, జోడో యాత్రలో 1947లో విడిపోయిన భారత్ ను కలిపేందుకు ఆయన కరాచీ, లాహోర్ వెళ్తారని అనుకున్నా అంటూ వ్యాఖ్యానించారు. భారత్ ఏకంగా, సఖ్యతో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ యాత్రను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా చూసుకునే వారిని ప్రజలు ఆదరిస్తారని అన్నారు. అది బీజేపీ మాత్రమే చేయగలదని అన్నారు.
ప్రధాని మోదీకి ‘‘సమాధి తవ్వుతాం’’ అని విమర్శలు చేస్తున్నారు, కానీ వారు వారి సమాధినే తవ్వుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. బీజేపీ, ప్రధానిమోదీపై ఎంత బురదజల్లితే అంతగా కమలం వికసిస్తుందని అన్నారు. రక్షణ మంత్రిగా నేను మన సైనిక బలగాల ధైర్యసాహసాలు చూసి గర్వపడుతున్నానని అన్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని, మేఘాలయాలో బీజేపీ సీట్లు పెరిగాయని, మూడింట రెండొంతుల మెజారిటీతో కర్ణాటకలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ ఎప్పుడూ మాటపై నిలబడుతుందని, ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ రద్దు వంటివి తీసుకువచ్చామని అన్నారు.