Komatireddy Venkat Reddy : భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయన్నారు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరని, ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించామన్నారు. మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించానని, పేద విద్యార్థులు నా దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నా అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఏ సర్వే చూసినా కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతోందన్నారు ఎంపీ కోమటిరెడ్డి. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని, కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది.. గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు.
Also Read : Viral Video: వీడు మామూలోడు కాదురా సామీ… సింహాన్నే చెప్పుతో కొట్టిన వ్యక్తి!
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
గ్రూప్-2 పరీక్ష పోస్ట్ పోన్ చేయమంటే చేయడం లేదని, మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు కోమటిరెడ్డి. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్న కోమటిరెడ్డి.. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ని గెలిపిస్తానన్నారు. 24 గంటల కరెంట్ పై ప్రభుత్వం చెప్పేవి అబద్ధాలని, లాగ్ బుక్స్ తో అన్నీ బయటపెట్టానన్నారు. మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తామని, 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారు.. 50వేల కోట్లు తాగుడు మీదే వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయని, ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతాం.. తెలంగాణ అంతా కాంగ్రెస్ నేతలం పర్యటిస్తామన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Also Read : Prabhas: అవి అయిపోగానే ప్రభాస్‌కి సర్జరీ… మళ్లీ ఏమైంది?
తాజావార్తలు
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!