జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట 2వ ఏఎన్ఎమ్ లు సర్వీస్ క్రమబద్దీకరణ కోరుతూ.. నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. 2వ ఏఎన్ఎమ్ ల ఉద్యోగలను క్రమబద్దికరించి వారి జీవితాల్లో వెలుగులు నింపే బాధ్యత నాది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. 2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. మీ అండదండలతోఉద్యోగాలు క్రమబద్ధీకరించే వరకు పోరాడుతాను అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తెలిపారు.
Read Also: India vs Ireland: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. మొదటి ఓవర్లోనే బుమ్రా ప్రతాపం
2023 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్న నేను సంవత్సరం పాటు ఎమ్మెల్సీగా ఉంటాను మీకు అండగా ఉండి మీ ఉద్యోగాలు క్రమబద్దికరించే బాధ్యత నాది అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2023లో ఫలితాలు నాకు అనకూలంగా ఉంటే సంతోషమే.. అందుకు భిన్నంగా ఉన్న నా శాసన మండలి పదవి కాలం 2025 మార్చ్ వరకు ఉంటుంది.. మీ అండదండలతో మీకోసం పోరడుతాను అని తెలిపాడు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. రాజకీయాల నుంచి తాను అంత ఈజీగా పోయేటోడిని కాదని అన్నారు.
Read Also: Vishnu Priya : సమ్మోహనుడా సాంగ్ కు హాట్ స్టెప్స్ తో ఆకట్టుకున్న విష్ణు ప్రియ..
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న ఏఎన్ఎంల ఉద్యోగాల క్రమబద్ధీకరణ బాధ్యత తానే తీసుకుంటున్నట్లు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఏఎన్ఎంల సేవలు వెలకట్టలేనివని, అలాంటి వారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తి వేస్తానని చెప్పిన కేసీఆర్ ఏఎన్ఎంలను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కొంత మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యూలరైజ్ చేసిన విధంగానే సెకండ్ ఏఎన్ఎంలు, అవుట్ సోర్సింగ్ ఏఎన్ఎంల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.