Madhyapradesh: మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఫార్ములా అదే.. వ్యూహాన్ని మార్చుకున్న కమలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది. అధికార బీజేపీ ఉచితాలు హామీలు గుప్పించినా తమదే విజయమని హస్తం పార్టీ ధీమాతో ఉంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పునరాగమనం చేయాలని కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ కొత్త పంథాను ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంది.
Read Also: Chandrayaan-3: జాబిల్లి తొలి ఫొటోలు తీసిన ల్యాండర్.. షేర్ చేసిన ఇస్రో
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జూన్ 12న ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా హామీల వర్షం కురిపించారు. తాము ఇచ్చిన హామీలు 100 శాతం నెరవేరుస్తామని, కర్ణాటక ప్రజలకు ఈ వాగ్దానం చేశామని, అక్కడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. “మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఇస్తాం.. రూ.500కే గ్యాస్ సిలిండర్, 100 యూనిట్ల విద్యుత్ ఉచితం.. 200 యూనిట్ల ధర సగానికి తగ్గింపు.. మధ్యప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానం అమలు చేస్తాం, పేద రైతులకు. భారీ రుణాలలో పూర్తి రుణమాఫీ చేస్తాం.”అని ఆమె హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లో అమలు చేయబోయే ఐదు హామీలను ఆమె వివరించారు.
మధ్యప్రదేశ్ చెస్ బోర్డుపై కాంగ్రెస్ చేసిన మొదటి ఎత్తుగడలలో ఒకటి రణదీప్ సుర్జేవాలా రాష్ట్ర బాధ్యతలు చేపట్టడం. సుర్జేవాలా గతంలో కాంగ్రెస్‌కు కర్ణాటక ఇంచార్జ్‌గా ఉన్నారు. కర్ణాటకలో అధిష్ఠానం ఆదేశంతో ఫలితాలను రాబట్టిన దక్షిణాది రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కానుగోలు.. మధ్యప్రదేశ్‌లో కూడా అదే ఫలితాలను తీసుకురావడానికి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రచార శ్రేణిలో అప్పటి అధికార పార్టీపై “40 శాతం కమీషన్” అభియోగం ఉండగా.. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ ఆరోపణను 10 శాతం అదనంగా “50 శాతం కమీషన్” ఛార్జీకి పెంచింది. “కుంభమేళా లోపల కూడా అవినీతి జరిగింది, ఇక్కడ సింహస్థ మేళా ఉంది, మహాకాల్ ఆలయ నిర్మాణంలో అవినీతి జరిగింది” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు.
Read Also: CM Sukhwinder Sukh: జల విలయాన్ని ‘రాష్ట్ర విపత్తు’గా ప్రకటిస్తున్నా..
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, దానికి బీజేపీ ధీటుగా సమాధానం చెబుతుందని మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ వీడీ శర్మ అన్నారు. నకిలీ లేఖతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఘాటుగా సమాధానం ఇస్తామని, ప్రతి కార్యకర్త ప్రియాంక గాంధీకి సమాధానం చెబుతారని, సమాధానం చెప్పాల్సింది మీరేనని, పరువునష్టం నేరానికి పాల్పడ్డారని వీడీ శర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వ్యూహాలను పసిగట్టిన బీజేపీ.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై దాడి చేయడానికి కొత్త పద్ధతులను ఉపయోగిస్తోంది. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగిన ఒక రోజు తర్వాత, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ప్రకటించింది. “మా సన్నాహాలు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి. అభ్యర్థుల పేర్లను ప్రకటించడానికి కాంగ్రెస్ భయపడుతున్నట్లు కనిపిస్తోంది. మేము మా అభ్యర్థులను పేర్కొన్నాము. మా అభ్యర్థులు ఇప్పుడు రంగంలో ఉన్నారు” అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
ఇదిలా ఉండగా ఇరు పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తోంది. బీజేపీ తరఫున హోం మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తున్నందున ఆయన అనేక కార్యక్రమాలకు హాజరవుతారు.
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!