జూపల్లి కృష్ణారావు అంత పెద్దోడు ఎప్పుడు అయ్యాడో నాకు అర్థం కాలేదు అని మాజీ మంత్రి నాగం జనార్థర్ రెడ్డి అన్నారు. ఇక్కడ గెలిచినోడు ఇక్కడే ఉంటాడు అని గ్యారంటీ ఎవరు ఇస్తారు.. నాగర్ కర్నూల్ నుంచి పోటీ ఎవరు చేస్తారన్న విషయం పార్టీ నిర్ణయిస్తుందని నాగం చెప్పారు.
ఎన్సీపీ అగ్రనేత శరద్ పవార్ లేదా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియా కథనంపై స్పందిస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని సుప్రియా సూలే చెప్పారు.
నిజామాబాద్ లో కాంగ్రెస్ బిసి గర్జన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పాల్గొన్నారు. తి పార్లమెంటు నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాం అని తెలిపారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 15) ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. తన కళ్లలో ఏదో సమస్య కారణంగా హాజరు కాలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది ఆయన నివాసం నుంచే జెండాను ఎగురవేస్తానని చెప్పారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల టైంలో మర్రి జనార్దన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపిస్తూ.. దాఖలు చేసిన పిటిషన్ను ఇవాళ ( సోమవారం ) హైకోర్టు కొట్టి వేసింది