సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు.
కాళేశ్వరం గొప్ప గురించి కేసీఆర్ చెప్పారని.. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎలా దెబ్బ తిన్నదో తెలుస్తోందని పొంగులేటి విమర్శించారు. దీనికి కారకులు ఎవరూ అని ప్రశ్నించారు. కాళేశ్వరం ఏటీఎంగా కేసీఆర్ కు ఉపయోగపడిందని అన్నారు. కాళేశ్వరం పై మొదటి నుంచి కాంగ్రెస్ చేసిన ఆరోపణలు నిజం అయ్యాయని.. సీవీసీ చేత విచారణ జరపాలని కోరారు.
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
తాను పోటీ పై షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు. తాను కామారెడ్డి నుంచే పోటీ చేస్తానన్నారు. కేసీఆర్ రా.. కామారెడ్డికి ఇద్దరం తల పడదామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు పథకం ప్రకారం తాను ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అధర్మ యుద్ధానికి పాల్పడితే కామారెడ్డి ప్రజలు క్షమించరని తెలిపారు.
Ponnam Prabhakar: నేడు విజయ దశమి సందర్భంగా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని తన నివాసంలో జమ్మిపూజ కార్యక్రమం నిర్వహించారు.
Hijab: గతేడాది కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. విద్యాలయాల్లోకి హిజాబ్ లేదా ఇతర మతపరమైన దుస్తులు ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం మతపరమైన భావాలను అణిచివేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
వైఎస్సార్ హయాంలో 38 వేల కోట్లతో గోదావరి నది జలల్లో వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టడానికి ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్ రూపొందించామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. breaking news, latest news, telugu news, jeevan reddy, brs, congress
INDIA bloc: 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, ఆర్జేడీ, శివసేన(ఉద్ధవ్), జేడీయూ, ఆప్, సమజ్ వాదీ(ఎస్పీ) పార్టీలు ‘ఇండియా’ పేరుతో కూటమిని కట్టాయి. అయితే ఇప్పటికే ఈ కూటమికి సంబంధించి మూడు సమావేశాలు జరిగాయి. సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం కూటమి తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు.
Congress to announce Second List after Dussehra: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. దసరా పండగ తర్వాత రెండో జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇంకా 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ…
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చిట్ చాట్‌లో భాగంగా.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీర్ఎస్ కు 88 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికలు ఉన్నపుడల్లా కాంగ్రెస్ ముహూర్తాలు పెట్టడం మాములేనని విమర్శించారు. తాము 95 శాతం అభ్యర్థులకు బి ఫార్మ్ లు ఇచ్చామన్నారు.