Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ స్థాయి బిఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఎన్నికల సన్నాహాక సమావేశంలో బిఆర్ఎస్ అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. 258 పోలింగ్ బూత్‌లో బూత్ స్థాయిలో 100 ఓటర్లకు ఒక్క నాయకుడుని నియమిస్తున్నట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికల సర్వేలో 75 శాతం గ్రాఫ్ వచ్చినట్లు కాంగ్రెస్ కు 22 శాతం, బీజేపీకీ 4 శాతం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడో…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ పాల్గొన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్నికల రూట్ మ్యాప్ పై ప్రధానంగా చర్చ జరిగింది. అభ్యర్థుల ఖరారు, అగ్రనేతల నేతల ప్రచారం, మేనిఫెస్టో అంశాలపై చర్చ కొనసాగింది.
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మీద ప్రజలకు విసుగు ఉంది అని ఆయన అన్నారు. అపుడు కాంగ్రెస్ పాలనలో చేసిన పాపాలను ప్రజలు మరచిపోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్రలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్‌లో రేపు సాయంత్రం జరగాల్సిన పాదయత్ర క్యాన్సిల్ అయింది. రేపు ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో ముఖాముఖీ సమావేశం అవుతారు.
28 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి లక్ష 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి అదనంగా చుక్క నీరు ఇవ్వకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని ఆయన అన్నారు.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
కేసీఆర్ ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతుంది.. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని చూస్తున్నాయి.. బీజేపీ, ఎంఐఎంకు ఓటు వేస్తే అవి బీఆర్ఎస్ కు వేసినట్టే.. బీజేపీపై పోరాడినందుకు నాపై కేసులు పెట్టారు.. నా లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సన్నాసి.. తెలంగాణకి.. కాంగ్రెస్ కి ఏం సంబంధం ఉందని అంటున్నాడు.. సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. మీరు బిచ్చం ఎత్తుకు బతికే వాళ్ళు అంటూ ఆయన మండిపడ్డారు.
DK Shiva Kumar: కాంగ్రెస్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కి కర్ణాటక హైకోర్టు షాకిచ్చింది. తనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేసిన డీకే శివకుమార్‌కి ఊహించని ఎదురుదెబ్బ తాకింది. ఆయన అభ్యర్థనను కర్ణాటక హైకోర్టు తిరస్కరించింది.
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్‌గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు.