KTR: కాంగ్రెస్- బీజేపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో యువకులు, బీఆర్ఎస్ యూత్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. అదే సోషల్ మీడియాలో సమాధానాలు చెప్పండి.. గతంలో సిరిసిల్లకు ఇప్పటి సిరిసిల్లకు తేడాను సోషల్ మీడియాలో ప్రచారం చేయండి.. సిరిసిల్ల ఒకప్పుడు ఉరిసిల్లగా ఉండే.. కానీ, ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో తెలపండి అని ఆయన అన్నారు. నేతన్న ఆత్మహత్య వద్దంటూ రాతలు సిరిసిల్ల గోడలపై ఉండేవి.. సిరిసిల్లలో ఇన్ని విద్యాసంస్థలు వస్తాయని కలలో కూడా ఎవరూ అనుకోలేదు.. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అందరు సిరిసిల్ల, గజ్వేల్ లోనే అభివృద్ధి అంటుంటే, సిరిసిల్ల నాయకులు మాత్రం సిరిసిల్లలో అభివృద్ధి ఏం లేదని అంటున్నారు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Read Also: MS Dhoni: రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ.. 2024లో ఐపీఎల్ ఆడతాడా?
Also Read
కేసీఆర్ న్యాయకత్వం మానేరును సజీవ ధారగా మార్చింది అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని తీసుకొస్తున్నాం.. సంక్షేమం అభివృద్ధి అన్ని రంగాల్లో పురోభివృద్ధి ని సాదిస్తున్నాం.. కాంగ్రెస్- బీజెపీ వాళ్ళకు మాత్రమే అభివృద్ధి కనబడటంలేదు.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే.. కుల, మతాల పేరుతో ముందుకు వస్తారని ఆయన మండిపడ్డారు. కులం, మతం కాదు గుణం చూసి ఓటెయ్యండి.. అభివృద్ధి నా కులం, సంక్షేమం నా మతం.. నేను పని చేస్తాను అనుకుంటేనే నాకు ఓటెయ్యండి.. సిరిసిల్ల చరిత్రలో మొదటి సారి 2014 సిరిసిల్ల ఎమ్మెల్యే కు మంత్రి పదవి వచ్చింది అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: MK Stalin: గవర్నర్‌ని మార్చొద్దు, మాకు ఉపయోగపడుతున్నాడు.. ప్రధానిపై స్టాలిన్ విమర్శలు.
ఇంతకష్టపడి సాదించుకుని.. ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి అవుతుండట, మెడమీద తల ఉన్నోడు ఎవడైనా ఇతడి చేతిలో రాష్ట్రాన్ని పెడతాడా అని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు దొంగ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అవుతాడని గాంధీ ఆనాడే ఊహించాడు.. కాంగ్రెస్ దిక్కులేని స్థితిలో రాష్ట్రం ఇచ్చారు.. కానీ, ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు.. 55 ఏండ్లలో చేతకాలేదు కానీ, ఇప్పుడు అదిలేదు.. ఇదిలేదు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రూపాయల డిజీల్ 100 రూపాయలు, 70 రూపాయల పెట్రోలు 110 రూపాయలు చేసినందుకు దేవుడా నరేంద్ర మోడీ.. ఎలక్షన్ అన్నపుడు ఆగంకాకుండా ఆచితూచి అడుగులు వేయండి.. విజన్ ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఒక్కడైనా ఉన్నాడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..