PM Modi: ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోడీ. శుక్రవారం మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ని ప్రారంభించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ‘పాత ఫోన్’గా అభివర్ణించారు. 2014లోనే ప్రజలు ఆ ఫోన్లను వదిలేసి దేశ గతని మార్చే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. ‘‘కాలం చెల్లిన ఫోన్లలో పనిచేయని స్క్రీన్లపై ఎన్ని సార్లు స్వైప్ చేసి, ఎన్ని బటన్లు నొక్కిన ఫలితం ఉండదు. రిస్టార్ట్ చేసినా, బ్యాటరీ మార్చినా ప్రయోజం ఉందు. గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి స్థితిలోనే ఉండేది’’ అని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
Read Also: BRS Chief: 24 గంటల కరెంట్, రైతుబంధు, అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ గెలవాలి
2014లోనే ప్రజలు కాలం చెల్లిన ఫఓన్లను వదిలేశారని, ఈ దేశానికి సేవ చేసేందుకు మాకు అవకాశం ఇచ్చారని, 2014 కేవలం ఒక తేదీ మాత్రమే కాదని, అదో పెను మార్పు అంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. గతంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరిగిందో అని యూపీఏ హాయంలోని 2జీ కుంభకోణాన్ని ప్రస్తావించారు. మా హమాంలో 4జీని విస్తరించాం, కాని ఒక్క మచ్చకూడా పడలేదని కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోడీ అన్నారు.
వేగవంతమైన 5జీ టెలిఫోన్ నెట్వర్క్ తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు 6జీ వైపు అడుగులు వేస్తున్నామని దేశం సాధించిన విజయాలను ప్రధాని గుర్తు చేశారు. 5జీ అందుబాటులోకి వచ్చిన ఏడాది లోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామని, బ్రాడ్ బ్యాండ్ వేగంలో గతంలో భారత్ 118వ ర్యాంకులో ఉంటే, ఇప్పుడు 43వ ర్యాంకుకు చేరుకున్నామని ఆయన వెల్లడించారు. భారత్ లో గూగుల్ తన ఫిక్సెల్ ఫోన్లను తయారు చేయనున్నట్లు ప్రకటించిందని, శాంసంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ప్రపంచమంతా మేడిన్ ఇండియా ఫోన్లు ఉపయోగిస్తున్నాయని అన్నారు.