Rajasthan: రాజస్థాన్ లో దారుణం జరిగింది. భూమి విషయంలో తగాదా ఒకరి దారుణ హత్యకి కారణమైంది. ఒక వ్యక్తి తన సోదరుడిపై నుంచి ట్రాక్టర్ పోనిచ్చి హత్య చేశాడు. ఒకసారి కాదు 8 సార్లు అతనిని ట్రాక్టర్ తో తొక్కించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లోని భరత్పూర్ లో చోటు చేసుకుంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తనకు ఎలాంటి సమాచారం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ పాలకుల చేతుల్లో అధికారం పెడితే తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారు అంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో గొప్ప నగరంగా కరీంనగర్ ను తీర్చిదిద్దుతా.. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు పరీక్షించే నాయకునికి పట్టం కట్టాలి అని మంత్రి గంగులా కమలాకర్ కోరారు.
Raja Gopal Reddy: తప్పనిసరి పరిస్థితుల్లోనే బిజెపికి రాజీనామా చేస్తున్నానని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ద్వారా నాకు నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బిజెపికి ధన్యవాదాలు.
సూర్యాపేట జిల్లా వేపల సింగారం గ్రామంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పర్యటించారు. గ్రామంలోకి చేరుకున్న ఉత్తమ్‌కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. breaking news, latest news, telugu news, big news, uttam kumar reddy, congress
సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈసారి ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలు అని విమర్శించారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి రాగానే రూ. 750కి ఎల్పిజి సిలిండర్, నెలకు రూ. 2 వేలు పెన్షన్, రూ. 15 లక్షల వరకు ఆరోగ్య బీమా ఇస్తామని హమీలు ఇచ్చారు.
అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల విషయంలో పార్టీలో ఏమైనా విభేదాలు, పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే మాట్లాడాలని సూచించారు ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్. పార్టీ టికెట్ల కేటాయింపుల విషయంలో ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.