శుక్రవారం (జూలై 18) నాగర్ కర్నూల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు నేనె సీఎంగా ఉంటానంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రకటన కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం…
ఆపరేషన్ సిందూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతిహరిలో పర్యటించారు. రూ.7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. మమత హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలు అభివృద్ధే లక్ష్యంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పని చేశారు.. ఇది అనుకోని ప్రోగ్రామ్, ఇక్కడకు ఇంతమంది సోదరులు వస్తారనుకోలేదు.. మా ఆడబిడ్డలు ఇంత తోపులాటలో ఇక్కడ వరకు వస్తారనుకోలేదు.. తెలంగాణ ప్రజలు మనకు రెండు దఫాలు అవకాశం ఇచ్చారు.. కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లు నిర్మాణ…
వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన రాహుల్.. నా బావ రాబర్టుని ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా వెంటాడుతోంది అని ఆరోపించారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ. నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ. ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు. వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్... తన పదవికి రాజీనామా చేస్తారా..? అలా చేయాలనుకోవడం వెనక ఆయన స్కెచ్ ఏంటన్నది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ హాట్ సబ్జెక్ట్. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన దానం.. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే... రాజీనామా చేయడమే బెటర్ అనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. తాజాగా... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం తెర మీదకు రావడంతో.. నాగేందర్ మనసు అటువైపు మళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ... చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది.