Revanth Reddy–Komatireddy Phone Call Goes Viral: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. మినిస్టర్ క్యాంప్ ఆఫీస్‌కు ఇందిరా భవన్‌గా నామకరణం చేశారు. ఆపై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను, భూమి పూజకు సంబంధించిన వివరాలను సీఎంకు మంత్రి వివరించారు.
స్కూల్ నిర్మాణ పనులకు భూమి పూజ, క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కందూరు జైవీర్ రెడ్డి హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డికి ఫోన్ చేయగా.. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు. మీరు మరలా సీఎం కావాలని ప్రత్యేక పూజలు చేశా అని సీఎంకు మంత్రి తెలిపారు. అందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఆపై మిగతా ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Komatireddy Venkat Reddy: కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
నల్గొండలో 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ విద్యా రంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా విప్లవాత్మక మార్పు ప్రారంభం కానుంది. పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు ఇక్కడ ఉంటాయని చెప్పారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే చారిత్రాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.