Off The Record: పేలతాయ్.. పొలిటికల్ బాంబులు పేలిపోతాయ్… చూస్తూ ఉండండి… బీభత్సాలు జరిగిపోతాయ్… చూస్తూనే ఉండండి. దాదాపు ఏడాది క్రితం తెలంగాణ మంత్రి ఒకరు చేసిన సంచలన వ్యాఖ్యలివి. ఎలాంటి రాజకీయ భూకంపం పుడుతుందో… ఇంకెలాంటి ఊహించని ఘటనలు జరుగుతాయోనని అప్పటి నుంచి ఇప్పటిదాకా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు అంతా. ఆ కాయలు పళ్ళయి రాలిపోయాయి తప్ప మార్పులేమీ కనిపించలేదు. దీంతో ఇప్పుడా మంత్రిని అపోజిషన్ పార్టీ ట్రోల్ చేస్తోందట. ఎవరా మినిస్టర్? ఏంటా కథ?
Read Also:Disha Patani : వర్షాకాలంలో ఘాటు పెంచేస్తున్న దిశాపటానీ
కబుర్లు చెప్పే వాళ్ళు పని చేయరు… పని చేసే వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడరని అంటారు. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా… రాజకీయాలకు మాత్రం ఇది పర్‌ఫెక్ట్‌గా సరిపోతుందంటారు. చాలామంది నాయకులు… అది, ఇది… పొడిచేస్తాం, దున్నేస్తామంటూ భారీ భారీ డైలాగులైతే కొడతారుగానీ… వాస్తవంలో అంతా తుస్ తుస్ అని చెప్పడానికే అలాంటి మాటల్ని వాడతారు. ఇప్పుడు తెలంగాణ కేబినెట్‌లోని కొంతమంది మంత్రుల కామెంట్స్ కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయన్న అభిప్రాయం బలపడుతోందట రాజకీయ వర్గాల్లో. మరీ ఘోరంగా అదిగో పులి అంటే…ఇదిగో తోక అన్నట్టు మాట్లాడుతున్నారని, ఆ పద్ధతి కరెక్ట్ కాదంటున్నారు ఎక్కువ మంది. అసలు విషయం ఏంటంటే.. కామెంట్స్ చేయడం తప్పుకాదు కానీ… వాటికి డెడ్‌లైన్స్ పెట్టి, అవి వర్కౌట్ కానప్పుడే అసలు సమస్య. అందునా మంత్రి స్థాయిలో ఉండి, సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పుడు అవి ఆచరణలో కనిపించకుండే కచ్చితంగా ప్రతిపక్షానికి అస్త్రం అవుతాయి.
Read Also:PIB Fact Check: నో ‘ఫ్రీ స్యూటీలు’.. ఫ్యాక్ట్‌చెక్ షాకింగ్ పోస్ట్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అలాగే అయ్యాయట. అంతేనా… ఏకంగా ఆయన ఇంటిపేరును కూడా మార్చేసి ట్రోల్ చేస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాస్తా బాంబుల శ్రీనివాస్ రెడ్డిలా మారిపోయారంటూ వెటకారాలాడుతున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గడిచిన యూరప్ ట్రిప్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ సీరియస్‌గానే చెప్పారాయన. ఆయన ఆ మాటలని కాస్త అటు ఇటుగా ఏడాది కావస్తోంది. ఇప్పటి వరకు ఆయన చెప్పినట్టు బాంబుల మాత్రం పేలలేదు. కనీసం అవి ఎలా ఉంటాయన్న చర్చ కూడా జరగలేదు. అప్పట్లో ఫార్ములా ఈ రేసు కేసు విచారణ జరిగింది. దానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్న ప్రచారం జోరుగా జరిగింది. అలాంటి సందర్భంలోనే పొంగులేటి నోటి నుంచి పొలిటికల్ బాంబుల మాటలు వచ్చాయి. కానీ… కేటీఆర్‌ని విచారణకు పిలిచి ప్రశ్నించి పంపేశారు. ఇప్పటికీ ఆ కేసులో పురోగతి ఏంటన్నది ఎవరికీ తెలియదు.
Read Also: Off The Record: కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని సీఎం ఆదేశించారా?
దీనికి తోడు.. తాజాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనిపై అసెంబ్లీలో చర్చకు పెట్టి… విచారణకు ఆదేశిస్తారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు దాని మీద కూడా క్లారిటీ లేదు. మంత్రిగా పొంగులేటి కామెంట్స్ చేసి ఏడాది కావస్తున్నా.. ఆయన చెప్పిన బాంబులు పేలకపోగా… ప్రతిపక్షమే.. రివర్స్ పంచ్‌లు వేయడం చర్చనీయాంశం అయింది. పొంగులేటిని ఉద్దేశించి బాంబుల మంత్రి అంటూ సెటైర్స్ వేస్తున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. పైగా… అడపా దడపా ఈడీ దర్యాప్తునకు సంబంధిన అంశాలను ప్రస్తావిస్తూ….మంత్రిని ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో రకమైన చర్చ కూడా జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి బాగోతాలపై చర్యలు ఉంటాయని చెప్పే ఉద్దేశంలో పొంగులేటి అలా మాట్లాడి ఉంటారని, ఐతే… ఇప్పటి వరకు ప్రభుత్వ విచారణలు ఏవీ కొలిక్కి రాకపోవడంతో.. ఆయన మాటలు రివర్స్‌లో బౌన్స్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ బాంబుల లొల్లి ఇక్కడితో ఆగుతుందా, లేక అట్నుంచి రియాక్షన్‌తో కొత్త టర్న్ తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.