సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు.
చనిపోయిన తన తల్లిపై కాంగ్రెస్, ఆర్జేడీ దుర్భాషలాడిందని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. తన తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని.. అయినా కూడా తన తల్లిని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో పీసీసీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి రాజ్…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరకాల కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తప్పకుండా ప్రధాని అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. నేడు వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఆయన చిత్రపటానికి మహేష్ కుమార్ గౌడ్…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ ఎక్స్ట్రా ఫోకస్ చేసిందా ? కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ ఒక ఎత్తయితే... అందులో అన్ని అంశాలను సమ్మిళితం చేస్తోందా? అందుకే రేస్ నుంచి అజారుద్దీన్ను తప్పించేసిందా ?
కాళేశ్వరాన్ని కామధేనువుగా మార్చుకున్నారనే తమ మాట నిజం అయ్యిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ అగ్ర నేతలు కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని.. ఏఈ, ఎస్ఈ ల వద్ద కోట్ల రూపాయలు దొరకడం అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం అన్ని వర్గాల, పక్షాల సూచనల మేరకు గొప్ప నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్నారని ప్రశంసించారు. కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడం అనేది గొప్ప నిర్ణయం అని కొమియాడారు. కాళేశ్వరం కమిషన్…
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు నేపథ్యంలో ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు.. తదితర రూపాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ధర్నాలకు పిలుపునిచ్చారు. Also Read: Kaleshwaram Project:…
కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్రావు హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఆపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పీసీ ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. రెగ్యులర్ పిటిషన్ల లాగే విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు…
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తెలంగాణ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంకు అనుమతి తప్పనిసరి అని జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సాధారణ సమ్మతి (General Consent)ని రద్దు చేసింది. అంటే.. సీబీఐకి దర్యాప్తు కోసం రాష్ట్రంలో ప్రవేశించేందుకు ప్రతి కేసులో ప్రత్యేక అనుమతి అవసరం. ఈ నిర్ణయం జీవో ఎంఎస్ నెం.51 ద్వారా 30 ఆగస్టు 2022న జారీ చేయబడింది. ఈ జీవో ప్రకారం.. గతంలో ఇచ్చిన సాధారణ అనుమతులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ఈ…
రిజర్వేషన్ ల అమలుకోసం 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.