కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో... ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదంతా ప్రాజెక్ట్ నిర్మాణం చుట్టూ జరుగుతున్న రచ్చ. ఫ్రంట్ పోర్షన్లో ఆ స్థాయి రచ్చ జరుగుతుంటే... బ్యాక్‌లో కూడా ఆ స్థాయి కాకున్నా... దాదాపు అలాంటి గొడవే జరుగుతోంది. అక్కడ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ లబ్దికోసం పావులు కదుపుతూ పరస్పరం టార్గెట్ చేసుకుంటున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్ఎస్కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా ఇండియా కూటమి గుర్తించింది. అనుకున్నదానికంటే జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓట్లు తక్కువ పడ్డాయి. దీంతో ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లుగా హస్తం పార్టీ గుర్తించింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే... సొంత ప్రభుత్వాన్నే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారా? ఆయన దూకుడు ఇప్పుడు సహచర ఎమ్మెల్యేలను కూడా ఇరకాటంలో పడేస్తోందా? వేలాది మందితో... సొంత ప్రభుత్వం మీదే దండెత్తే ప్లాన్‌లో ఆ శాసనసభ్యుడు ఉన్నారా? అసలు ఎవరాయన? ఆ రాజకీయ వ్యూహం ఏంటి?
కరీంనగర్ కాంగ్రెస్ కయ్యాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న వార్ కాస్తా...ఇప్పుడు లీడర్ల మధ్యకు చేరింది. క్యాడర్‌ను గాడిలో పెట్టి స్థానిక ఎన్నికలకు సమాయాత్తం చేయాల్సిన ఇద్దరు కీలక నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మానకొండూర్ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ లోక్‌సభ సీటులో పోటీ చేసిన వెలిచాల రాజేందర్రావు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి తలెత్తింది. వినాయక చవితి వేడుకల సాక్షిగా ఈ పోరు…
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. అనంతరం ఎంపీలంతా ఒక్కొక్కరిగా ఓట్లు వేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
నల్గొండ ప్రజల కోసమే మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని.. ఎవరెన్ని సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య మాత్రమే కాకుండా.. నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కూడా తీరుతుందన్నారు. సబర్మతి, యమునా, గంగా నది ప్రక్షాళన జరగొచ్చు కానీ.. మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? అని సీఎం ప్రశ్నించారు. మూసీ…