వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో శ్రీరాముడి పేరును ఎగతాళి చేస్తూ వస్తోందని, రాముడి పట్ల వారికి గౌరవం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జనహిత యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్పై విరుచుకుపడుతూ, జనహిత యాత్ర లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనని చెప్పారు.
ఓట్ల చోరీ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపునకు స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఓట్ల చోరీ వ్యతిరేక ప్రచారానికి సంబంధించిన ప్రత్యేక లోగోను సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. శనివారం ఇంఛార్జ్ మంత్రులు సమావేశం అయ్యారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి, జూబ్లీహిల్స్ ఇంఛార్జ్ చైర్మన్లు పాల్గొన్నారు
టెక్నికల్గా తానింకా బీఆర్ఎస్లోనే ఉన్నానని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఎన్టీవీతో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్లపై గద్వాల ఎమ్మెల్యే స్పందించారు.
Congress PAC- TPCC Meeting: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగానే, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వజరీ కమిటీ ఈరోజు ( ఆగస్టు 23న) సాయంత్రం 5 గంటలకి కీలక సమావేశం కానున్నాయి.