ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నదిని తప్పకుండా ప్రక్షాళన చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ఏడాదే గోదావరి ఫేజ్ 2, 3 పనులు ప్రారంభిద్దాం అనుకున్నా కొందరు అడ్డుకున్నారని.. గోదావరి ఫేజ్ 2, 3 ద్వారా 20 టీఎంసీల నీటిని తీసుకువస్తాం అని చెప్పారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఒక్క చుక్క నగరానికి తీసుకురావాలనే ఆలోచన చేయలేదని, తాము మరలా అధికారంలోకి వచ్చాక గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు చేసి ముందుకెళ్తున్నామన్నారు. ప్రాణహిత…
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటింగ్‌లో పాల్గొనదు అని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణ న్యాయ కోవిధుడు అని, ఆయనకు మద్దతు ఇవ్వకపోవడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయలేమని బీఆర్ఎస్ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాలకు కనెక్షన్ లేకుండా బీఆర్ఎస్ మారిందని, ఇంటి లొల్లిలకే పార్టీ పెద్దలకు సరిపోతోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిందని ఎంపీ చామల…
ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీ, జనసేన, బీఆర్ఎస్ ఎంపీలు.. తెలుగు వ్యక్తి, యూపీఏ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఒక దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘నికోబార్‌లో పర్యావరణ విపత్తును సృష్టించడం’’ అనే శీర్షికతో ది హిందూలో ప్రచురితమైన ఒక కథనాన్ని రాహుల్‌గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది.. ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరం పై కక్ష కట్టింది.. కాళేశ్వరం పై కక్ష కట్టి సిబిఐ విచారణ కు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.. తల దగ్గర…
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో జరిగిన ఈ చర్చలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ విమర్శించారు. కొత్తగా నేను ఏదో చేస్తానని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదం అన్నారు. చంద్రబాబు ‘వాట్సప్ పరిపాలన అంటూ.. వాటాల పరిపాలన’ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గం అని పేర్కొన్నారు. దళితుల జోలికి పోవడం చంద్రబాబుకు మంచి పద్ధతి కాదని చింతా మోహన్…
SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.