Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది?…
అధికార పార్టీకి వత్తాసుగా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లు చోరీ చేస్తుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం ప్రెస్‌మీట్ పెట్టి మరీ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. తాజాగా మరోసారి శుక్రవారం ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘ఉదయం 4 గంటలకు నిద్రలేవండి.. 37 సెకన్లలో ఇద్దరు ఓటర్లను తొలగించండి. ఆపై తిరిగి నిద్రపోండి.’’ అని ఎన్నికల సంఘాన్ని ఉద్దేశించి రాహుల్‌గాంధీ పోస్ట్ చేశారు.
కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు రాజ్ గోపాల్ రెడ్డి.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. నిన్న ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి గుంటూరు వచ్చాను. ఈరోజు విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకున్నాను.. నేను ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి రాజకీయంగా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను నిన్ననే మీడియా ముందు క్లారిటీ ఇచ్చాను.. కొంతమంది కావాలని నా ప్రతిష్టను దెబ్బతీయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు.. వాటిని నమ్మకండి.. నేను ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవడం లేదు అన్నారు..
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్, సీనియర్ నేత కేఎస్.అళగిరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కంగనా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తే.. రైతులు చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి సొంత గన్‌మ్యాన్ బుల్లెట్ యూరియా రూపంలో గట్టిగానే దిగిందట. గన్‌మ్యాన్ నాగు నాయక్ యూరియా లోడ్‌ను పక్కాదారి పట్టించిన వ్యవహారం... తిరిగి తిరిగి ఎమ్మెల్యేకు మెడకు చుట్టుకున్నట్టు తెలుస్తోంది. అది ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారడంతో...బీఎల్ఆర్ మీద అధికార పార్టీ కీలక నేతలు బాగా సీరియస్ అయినట్టు సమాచారం. ఆ డ్యామేజ్ ను కంట్రోల్ చేసి.... తన ఇమేజ్‌ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి..…
Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘‘ఓట్ చోరీ’’ ఆరోపణలో గురువారం మీడియా ముందుకు వచ్చారు. కొన్ని ఉదాహరణలు వివరిస్తూ, దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోందని అన్నారు. కర్ణాటకలో అలంద్ నియోజకవర్గంలో 6000 ఓట్లను తొలగించినట్లు ఆరోపించారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడే వారికి అండగా నిలుస్తుందని ఆరోపణలు చేశారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తు్న్నారని అన్నారు.
Saudi-Pak defence deal: సౌదీ అరేబియా పాకిస్తాన్‌తో "వ్యూహాత్మక పరస్పర రక్షణ" ఒప్పందంపై కాంగ్రెస్ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఇది భారత ప్రధాని నరేంద్రమోడీ దౌత్యానికి ఎదురుదెబ్బగా దీనిని అభివర్ణించారు. ‘‘ఆపరేషన్ సిందూర్’’ అకస్మాత్తుగా ఆగిపోయిన నెల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు వైట్ హౌజ్‌లో విందు ఇచ్చారని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్…
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. కాంగ్రెస్ చొరబాటుదారులను కాపాడుతోందని తిప్పికొట్టారు. బీహార్‌లోని డెహ్రీలో షహాబాద్, మగధ్ ప్రాంతాలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.