జీఎస్టీలో మార్పులు దేశాభివృద్ధిలో నిర్మాణాత్మక సంస్కరణలు అని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్లో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు. యూపీఏ హయాంలో ట్యాక్స్‌ల మోత మోగిందని.. 2014 ముందు పన్నులతో ప్రజలకు నరకం చూపించారని ఆరోపించారు.
లడఖ్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంటోగ్ స్టాన్జిన్ త్సెపాగ్ హస్తం ఉన్నట్లుగా బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా ఎక్స్‌లో ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. రాహుల్‌గాంధీ ఇలాంటి అశాంతిని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కౌన్సిలర్.. బీజేపీ కార్యాలయం, వాహనాలు తగలబెట్టాలని ప్రేరేపించారని బీజేపీ ఆరోపించింది.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం (AICC) తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియను సీరియస్‌గా ప్రారంభించడానికి ముందుగా 22 మంది పరిశీలకులను నియమించింది.
గత ఢిల్లీ పాలకులు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని పట్టించుకోలేదని ప్రధాని మోడీ విమర్శించారు. మోడీ సోమవారం అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇటానగర్ సభలో మోడీ ప్రసంగించారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఒక దశాబ్ద కాలంలో భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా సాధించలేని అభివృద్ధిని మోడీ చేసి చూపించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు వివరించారు.
ముఖ్యమంత్రి అభ్యర్థి లేకుండా ఇండియా కూటమి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. ఒక జాతీయ మీడియాకు తేజస్వి యాదవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.