TPCC Mahesh Goud : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ఆయన సమావేశమై, ఎన్నికల వ్యూహాలపై కీలక సూచనలు చేశారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. “ఇది చాలా కీలకమైన సమయం. ఈ వారం రోజులు ఎన్నికల ఫలితాలను నిర్ణయించే రోజులు. ప్రతి నాయకుడు తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాలి. చిన్న నిర్లక్ష్యం కూడా చేయకూడదు,” అని స్పష్టం చేశారు.
Chevella Bus Accident: ఇద్దరు పిల్లలను అనాథలను చేసిన చేవెళ్ల బస్సు ప్రమాదం
రెండు సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని తెలిపారు. “మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే, మన విజయాన్ని ఎవరూ ఆపలేరు,” అని ఆయన అన్నారు. అలాగే, ఇంటింటి ప్రచారం, వీధి స్థాయి ప్రచారంలో పార్టీ నాయకులు మరింత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. “మీరందరూ అనుభవజ్ఞులైన నాయకులు. ప్రజలను కాంగ్రెస్ వైపు ఎలా నడిపించాలో మీకు బాగా తెలుసు. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ అభ్యర్థిలా పని చేయాలి. ఫలితం మనకు అనుకూలంగానే వస్తుంది, మంచి మెజారిటీతో గెలుస్తాం,” అని మహేశ్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.