Bihar Elections Result: ముందంజలో ఎన్డీఏ.. పోస్టల్ కౌంటింగ్‌లో ఎవరికెన్ని వచ్చాయంటే..!
- ముందంజలో ఎన్డీఏ
- పోస్టల్ కౌంటింగ్‌లో ఎవరికెన్ని వచ్చాయంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరిగింది. ఈ పోస్టల్ లెక్కింపులో ఎన్డీఏ కూటమి దూసుకుపోయింది. ప్రస్తుతం ఎన్డీఏ-71, ఇండియా కూటమి-44, జన్ సురాజ్ పార్టీ – 2 స్థానాల్లో దూసుకెళ్తున్నాయి.
మధ్యాహ్నం కల్లా బీహార్ ఫలితాలు రానున్నాయి. ఇక సర్వేలు చెప్పినట్లుగానే ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. దీంతో కార్యకర్తలు, నేతలు సంబరాలకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే స్వీట్లు, బాణాసంచాను ఎన్డీఏ కార్యకర్తలు సిద్ధం చేశారు.
Also Read
రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ముందంజ
ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కంచుకోట అయిన రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ముందంజలో ఉన్నారు. తేజస్వి యాదవ్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. రాఘోపూర్ ఆర్జేడీకి బలమైన స్థానం. గతంలో తేజస్వి యాదవ్ తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, అతని తల్లి రబ్రీ దేవి ఇక్కడ నుంచే విజయం సాధించారు. ఇక తేజస్వి యాదవ్ 2015 నుంచి ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో 38,000 ఓట్ల తేడాతో తేజస్వి యాదవ్ గెలుపొందారు.
ఇక అలీపూర్‌లో మైథిలీ ఠాకూర్.. తారాపూర్‌లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి.. మహూవా నుంచి లాలూ పెద్ద కుమారుడు కుమారుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!