Jubilee Hills Bypoll Results Live Updates: హైదరాబాదీలతో పాటు తెలంగాణ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. పోస్టల్ బ్యాలెట్ల నుంచి.. ప్రతీ రౌండ్ లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు..
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కి వచ్చిన ఓట్లు 98,945. బీఆర్‌ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 74,234. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజార్టీ 24,711.
KTR Reacts to Congress Victory in Jubilee Hills Byelection; జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించి మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో జయ అయాపజయాలు కామన్ అని మా నాయకులు కేసీఆర్ ఎప్పుడూ చెబుతారన్నారు. ఫలితం తమకు కొంత నిరుత్సాహ పరిచిందని.. అయినా తాము కృంగి పోవడం లేదని స్పష్టం చేశారు. సహకారం అందించిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 407 బూత్‌లలో తమ లోకల్ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు. తమ అభ్యర్థి కొత్త అభ్యర్థి చాలా కోట్లాడారన్నారు. తమకు ఓటు వేసిన ఓటర్లకి ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో ఓటరు జాబితా తప్పులతడకగా ఉంది అని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బీహార్‌లో మేం ఊహించనంత మెజార్టీ ఇచ్చారు.. ఓట్ చోరీపై కాంగ్రెస్ పార్టీ విషప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారన్నారు.. దేశమంతా S.I.R జరగాలి అన్నారు.. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వులపాలయ్యారన్న ఆయన.. ఈవీఎంల హైజాక్ అంటూ రాహుల్ మాట్లాడారు.. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా గెలిచారు? అని ప్రశ్నించారు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.. 24,658 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ విజయాన్ని నమోదు చేశారు.. అయితే, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి డిపాజిట్ గల్లంతు అయ్యింది.. అధికారంలోకి వచ్చాక రెండు ఉప ఎన్నికల్లో విజయం సాధించింది కాంగ్రెస్..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో సీఎం రేవంత్‌రెడ్డి ఇమేజ్ పెరిగిపోయింది.. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌రెడ్డికి ఇది రెండో విజయం.. కంట్మోన్మెంట్ ఉప ఎన్నిక తర్వాత మళ్లీ జూబ్లీహిల్స్‌లో ఘన విజయం.. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును భారీ మెజార్టీతో గెలిపించిన రేవంత్.. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి తిరుగులేని వ్యూహం రచించిన రేవంత్ రెడ్డి..
జూబ్లీహిల్స్ బై పోల్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి.. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. కాసేపట్లో ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించనుంది..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 9వ రౌండ్ కౌంటింగ్ ముగిసింది.. అయితే, తొమ్మిదో రౌండ్ లోనూ కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది.. 9వ రౌండ్ లోనే 2,117 ఓట్ల మెజార్టీ దక్కింది.. ఇక, 9 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 23,612 ఓట్ల ఆధిక్యం లభించింది..
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని తెలిపారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వంద సీట్లు సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్ పాలనకు నిదర్శనంగా పేర్కొన్న ఆయన.. వచ్చే 8 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు..
ముగిసిన 8వ రౌండ్ కౌంటింగ్.. 8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం
బీజేపీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. బీఆర్ఎస్ సింపతిని ప్రచారం చేసింది. కానీ.. ప్రజలు మాత్రం మాకు పని చేసేటోళ్లే కావాలని నిర్ణయించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఆదరించారు. గతంలో పి.జనార్దన్‌రెడ్డి ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో ఆయన అడుగు జాడల్లో నవీన్ యాదవ్ చేస్తాడని ప్రజలు నమ్మారు. కాబట్టి ఇంత మెజారిటీ వస్తోంది. ఇంకా మెజారిటీ పెరుగుతుందనేది నా ఉద్దేశ్యం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్
జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్.. ముగిసిన ఏడో రౌండ్ కౌంటింగ్.. 7వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 4,030 ఓట్ల ఆధిక్యం.. ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 19,619 ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు పలు డివిజన్ బాధ్యలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రులు మంత్రుల పెర్ఫార్మెన్స్ గురించి చూద్దాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్‌లో పూర్తి మెజార్టీ తెచ్చిపెట్టారు. రహమత్ నగర్ లో పొంగులేటి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుని గ్రౌండ్ ఖాళీ చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలకు వెంగల్‌రావు నగగర్ బాధ్యతలు అప్పగించారు. ఇందులోనూ కాంగ్రెస్‌కి అత్యధిక ఓట్లు సాధించాయి. కమ్మ సామాజిక వర్గం ఏకతాటి మీదకు తేవడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారు. షేక్‌పేటలో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి అంతంత పెర్ఫార్మెన్స్ చూపించారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఎర్రగడ్డలో మెజార్టీ చూపారు. యూసఫ్‌గూడలో మంత్రి ఉత్తమ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ లీడ్ చేశారు. ఎర్రగడ్డలో మైనార్టీల మత పెద్దలులతో మీటింగులు.. అపార్ట్ మెంట్ వాసుల మీటింగులు కొనసాగాయి.
విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు ప్రారంభం.. సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత VH , మెట్టు సాయి, ఇతర నేతలు.. గాంధీ భవన్‌లో కేక్ కట్ చేసి సంబరాలను ప్రారంభిస్తున్న నేతలు...
ఐదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్‌కు12,857 ఓట్ల మెజారిటీ.. కాంగ్రెస్‌కు వచ్చిన మొత్తం ఓట్లు 12,283.. బీఆర్ఎస్‌కు వచ్చిన మొత్తం ఓట్లు 8,985
గాంధీభవన్‌లో సంబరాలు.. సంబరాల్లో మునిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు..
జూబ్లీహిల్స్‌లో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్.. ఐదో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం.. ఐదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,178 ఓట్ల ఆధిక్యం.. ఐదు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్ల ఆధిక్యం
జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్.. 10 వేల ఓట్ల మెజారిటీ దిశగా హస్తం పార్టీ.. కొనసాగుతున్న 5వ రౌండ్ ఓట్ల లెక్కింపు.. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం -47 ఓట్లు.. రెండో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం- 2,995 ఓట్లు.. మూడో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం - 2,843.. నాలుగో రౌండ్‌లో - 3,558 ఓట్లు.. నాలుగు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం - 9,501
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా.. 10 వేల మెజార్టీకి చేరువలో కాంగ్రెస్.. కాంగ్రెస్ ఆధిక్యం: తొలి రౌండ్ 47... 2వ రౌండ్ 2,947, మూడో రౌండ్ 3,100, నాల్గో రౌండ్ 3,100
కొనసాగుతున్న మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు.. ప్రస్తుతం 3000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్.. రెండో రౌండ్ ముగిసే సరికి 2,947 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్..
ముగిసిన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు.. 1082 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్.. కాంగ్రెస్‌కు 9,691.. బీఆర్ఎస్‌కు 8,609 ఓట్లు..
రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. వెయ్యికి పైగా లీడ్‌లో కాంగ్రెస్..
మొదలైన రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు..
తొలి రౌండ్‌లో నవీన్ ముందంజ.. కాంగ్రెస్‌కు 62 ఓట్ల మెజారిటీ.. కాంగ్రెస్‌కు 8,926. బీఆర్ఎస్ 8,864..
తొలి రౌండ్‌లో నవీన్ ముందంజ.. కాంగ్రెస్‌కు 62 ఓట్ల మెజారిటీ..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది.. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల సంఖ్య 101 కాగా.. బీఆర్ఎస్ - 36, కాంగ్రెస్ - 39, బీజేపీ - 10 వచ్చాయి
పూర్తయిన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు.. ఈవీఎం ల కౌంటింగ్ ప్రారంభం.. మొదటగా షేక్ పేట్ డివిజన్ లోని 42 బాత్ ల ఈవీఎం లు లెక్కింపు.. ఒక్కో రౌండ్ లెక్కింపు 30 నిముషాల్లో పూర్తయ్యే అవకాశం..
Evmల ఓట్ల లెక్కింపు.. మొదట షేక్ పేట ఈవీఎంలు ఓపెన్.. 1 నుంచి 42 బూత్‌ల ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు
మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.. ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుతో లెక్కింపు ప్రక్రియ ప్రారంభం.. ఫలితాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ధీమా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ విషాదం.. అభ్యర్థి మహమ్మద్ అన్వర్ (40) గుండెపోటుతో మృతి.. ఎర్రగడ్డలో నివాసం ఉంటున్న మహమ్మద్ అన్వర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ షురూ.. యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం లో కౌంటింగ్.. ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. 10 రౌండ్స్ లో 42 టేబుల్స్ గా కౌంటింగ్.. ఒక్కో టేబుల్ కు ఒక్కో సీసీ కెమెరా ఏర్పాటు.. 186 మంది కౌంటింగ్ సిబ్బంది.. మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. ఓవర్ ఆల్ గా రెండు, మూడు గంటల్లోనే తేలనున్న ఫలితం.. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఓట్లు 4,01,365.. నవంబర్ 11 న జరిగిన పోలింగ్ లో 48.49 శాతం పోలింగ్ నమోదు.. పోలైన ఓట్లు 1,94,621.. గెలుపు పై కాంగ్రెస్, BRS ధీమా.. ముందుగా షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం పై అందరిలో ఒక్కటే ఉత్కంఠ..
కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన నవీన్.. మంచి మెజారిటీ తో గెలుస్తున్నాం: నవీన్ యాదవ్
బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు..
కౌంటింగ్ సెంటర్‌లోకి తన వెంట ఇద్దరు ఏజెంట్‌లను లోపలకి అనుమతి ఇవ్వాలన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. సునీత అభ్యర్థనకు అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు, ఎన్నికల సిబ్బంది.. ఒక అభ్యర్థితో ఒక ఏజెంట్‌కు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసిన పోలీసులు.. దీంతో అభ్యర్థి సునీతతో కేవలం ఒక ఏజెంట్‌ను మాత్రమే అనుమతి ఇచ్చిన సిబ్బంది..