Bhu Bharathi Bill: భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ సభలో ప్రవేశ పెట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని ఈ సందర్బంగా తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని, లక్షలాది మంది ధరణితో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ధరణిని అర్థరాత్రి ప్రమోట్ చేశారని, నాలుగు నెలలు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఆయన పేర్కొన్నారు. 2 నెలలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Also Read: Telangana Assembly: బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ వ్యాఖ్యలపై సభలో దుమారం
లోపభూయిష్టమైన ఆర్వోఆర్ చట్టం-2020ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని, కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం అని మంత్రి పొంగులేటి తెలిపారు. ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని, కొన్ని రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావలసినవి కూడా కోర్టులకు చేరాయని ఆయన వాపోయారు. భూ యజమానికి తెలియకుండానే భూమి చేయి దాటిపోయిందని, పేదల ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందని ఆయన అన్నారు.