Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్…
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
ఇండియూ కూటమిలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత కొద్దిరోజులుగా నాయకత్వ మార్పుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమి నాయకురాలిగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నియమించాలంటూ కూటమిలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్ అని, కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే అని ఆయన మండిపడ్డారు. తెలంగాణకి నంబర్ వన్…
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
M Jethamalani: సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తోంది. కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది.
Rahul Gandhi: శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని ఈ రోజు ( డిసెంబర్ 11) లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కోరారు.
పార్లమెంటులోకి ప్రవేశించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కారు దిగిన వెంటనే, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులు గులాబీ పువ్వుతో పాటు త్రివర్ణ పతాకాన్ని అందజేశారు.
వందశాతం రుణమాఫీ అయ్యిందంటున్నారు.. ఏ గ్రామంలో వంద శాతం రుణమాఫీ జరిగిందని నిరూపించినా.. చివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో రైతులకు వందశాతం రుణమాఫీ అయ్యిందేమో అడగండి.. వందశాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..