జమిలి.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. ఏ నాయకుడి నోట విన్నా.. ఏ రచ్చ బండ దగ్గర కూర్చున్నా.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతగా జమిలి పేరు మార్మోగడానికి కారణం. మోడీ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరికొత్త రాజకీయ ఆలోచనకి పునాది.
పాలస్తీనాకు కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ పార్లమెంట్ వేదికగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాలస్తీనా అని ముద్రించిన బ్యాగ్‌తో పార్లమెంట్ హాల్లో హల్చల్ చేశారు.
Bhatti Vikramarka : బోనస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారని, పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం లేకుండానే గతములో కట్టిన ప్రాజెక్టుల తోటే ధాన్యం రికార్డు స్థాయి లో పండుతుందన్నారు. రైతులకు మేము చేసినంత గా ఎవ్వరూ చేయలేదని, మీరు రైతులను ఎంత మోసం చేశారో ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. ఏడాది కాలం లోనే 21…
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు.
Rahul Gandhi: లోక్‌సభలో భారత రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సావర్కార్ సిద్ధాంతంపై విమర్శలు గుప్పించారు.
Kiren Rijiju: లోక్‌సభలో భారత రాజ్యాంగంపై కొనసాగుతున్న చర్చల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీల పట్ల ఎలాంటి వివక్ష లేదని వెల్లడించారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
రాజ్యాంగంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఐక్యంగా, ప్రజాస్వామ్యంగా ఉంచేందుకు రాజ్యాంగం ఓ రోడ్‌మ్యాప్‌గా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు.
Constitution Debate: భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్‌సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు.