జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది.
నూతన అసెంబ్లీ నిర్మాణంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన అసెంబ్లీ అవసరమని.. సచివాలయం పక్కన ఎన్టీఆర్ గార్డెన్లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియా చిట్‌చాట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.
రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
జమిలి బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో దీన్ని చేపట్టారు. దీనికి 269 మంది బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు.
One Nation One Election Bill: జమిలీ ఎన్నికల (వన్ నేషన్ వన్ ఎలక్షన్) బిల్లులు లోక్‌సభ ముందుకు వచ్చింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా 2024 డిసెంబర్ 17న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలీ ఎన్నికల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ” వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ” పేరుతో 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రమంత్రి సభకు పరిచయం చేశారు. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్…
Congress: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు.
Jamili Elections: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి.
One Nation One Election Bill Live UPDATES: లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ (129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.
పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది..
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.