కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి పార్లమెంట్ ఆవరణలో అనూహ్యమైన పరిణామం ఎదురైంది. ఓ బీజేపీ మహిళా ఎంపీ ఇచ్చిన బ్యాగ్‌తో అవాక్కయ్యారు. ప్రియాంకా గాంధీకి ‘1984’ బ్యాగ్‌ను బహుమతిగా బీజేపీ ఎంపీ అపరాజితా షడంగి అందజేశారు.
భూభారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకోవడంపై అక్బరుద్దీన్, కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో బీఆర్ఎస్పై అక్బరుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రజల కోసమా..? కుటుంబం కోసం పోరాటం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. తాము ప్రజల కోసం పోరాటం చేస్తున్నామని అక్బరుద్దీన్ అన్నారు. మీ కుటుంబం కోసం అసెంబ్లీలో పోరాటం ఏమిటి..? అని ప్రశ్నించారు.
Jamili Election Bill: దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకు వచ్చిన 129వ రాజ్యాంగ సవరణ (వన్ నేషన్- వన్ ఎలక్షన్) బిల్లును ఈరోజు (డిసెంబర్ 20) లోక్‌సభ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది.
తెలంగాణ ఇండస్ట్రీయల్ పాలసీలో 14 రంగాలు పెట్టుబడి తీసుకొచ్చేవిగా గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఫార్ములా ఈ వాళ్లకు రేస్ కోసం అడిగాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా హైదరాబాద్‌ను మార్చాలనుకున్నామని తెలిపారు. వాళ్లు రాలేమని అన్నారు, ఒప్పించేందుకు చాలా ప్రయత్నించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి నేటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల ఫలితంగా రాష్ట్రం ఏ విధంగా దివాళా తీసిందో శాసనసభ సాక్షిగా ఈరోజు బయటపడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.6 లక్షల 71 వేల 756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.. అదే సమయంలో ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1 లక్షా 27 వేల కోట్లకుపైగా అప్పులు చేసినట్లు కూడా అసెంబ్లీ…
రేవంత్‌రెడ్డి సర్కార్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘హత్యాయత్నం’’ కేసు పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎంపీలపై కుట్ర, దుష్ప్రవర్తన కేసులను పెట్టింది. అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు.