Sonia Gandhi: మహాత్మా గాంధీ వారసత్వం ముప్పులో ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ఈ రోజు అన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న వారు, వారికి మద్దతు ఇచ్చే సంస్థల నుంచి మహాత్మా గాంధీ వారసత్వం ముప్పును ఎదుర్కొంటోందని అన్నారు. పరోక్షంగా బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్పై సోనియా గాంధీ దాడి చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో గాంధీ సిద్ధాంతాలు, సంస్థలు దాడులకు గురవుతున్నాయని అన్నారు. ఈ శక్తుల్ని ఎదుర్కోవడానికి మన సంకల్పాన్ని పునరుద్ధరించడం…
AAP: ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఢిల్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ మధ్య పోరు తెరపైకి వచ్చింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను దేశ వ్యతిరేకి అని అజయ్ మాకెన్ అనడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా అజయ్ మాకెన్పై చర్యలు తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది.
CWC meeting: కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.
Election Commission: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటర్ సంఖ్య గణాంకాలలో లేదా ఓటర్ బాబితా నుంచి ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు చేయలేదని ఈసీ చెప్పింది. అక్టోబర్ 19న మహారాష్ట్ర ప్రతిపక్ష ‘‘మహా వికాస్ అఘాడీ’’ పలు అంశాలపై ఎన్నికల కమిషన్ని కలిసింది. సాయంత్రం 5 గంటల ఓటింగ్ శాతం, తుది గణాంకాల్లో ఓటింగ్ శాతం మధ్య తేడాల గురించి ఈసీకి ఫిర్యాదు చేసింది.
Yogi Adityanath: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ని కాంగ్రెస్ పదేపదే అవమానించిందని, ఆయన మరణానంతరం ఆయన వారసత్వాన్ని అణగదొక్కిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మంగళవారం విమర్శించారు.
అంబేద్కర్పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి.
Congress: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ను ఎంపిక అయ్యారు. అయితే, ఛైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.